Kangana Ranaut : పరువు నష్టం కేసులో కంగనాకు కోర్టు వార్నింగ్‌! పదే పదే గైర్హాజరైతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక

Kangana Ranaut: పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై కోర్టు మండిపడింది. తదుపరి విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని ముంబై మెట్రోపాలిటన్ కోర్టు హెచ్చరించింది. అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోయినట్టు ఆమె తరుపున లాయర్ కోర్టుకు తెలిపారు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 14, 2021, 05:29 PM IST
  • కంగనాకు ముంబై కోర్టు వార్నింగ్‌
  • పదే పదే గైర్హాజరైతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని కోర్టు హెచ్చరిక
  • తదుపరి విచారణ సెప్టెంబరు 20కి వాయిదా
Kangana Ranaut : పరువు నష్టం కేసులో కంగనాకు కోర్టు వార్నింగ్‌!  పదే పదే  గైర్హాజరైతే అరెస్ట్ వారెంట్  జారీ చేస్తామని హెచ్చరిక

Kangana Ranaut: బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌కు  కోర్టు మరోసారి షాక్‌ ఇచ్చింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్‌ అఖ్తర్‌ వేసిన  పరువు నష్టం కేసు(Javed Akhtar Defamation Case,)లో  గైర్హాజరు కావడంపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు(Mumbai Metropolitan Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తం చేసిన కోర్టు  తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది.  తదుపరి విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్‌ వారెస్ట్‌ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20 కి వాయిదా వేసారు.

కాలయాపన చేస్తే...ఊరుకోం
జావేద్ అఖ్తర్(Javed Akhtar) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అంధేరి మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్  కోర్టులో  మంగళవారం  విచారణ జరిగింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్(Kangana Ranaut) మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. ఇదంతా చూస్తుంటే కావాలనే కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోందని కోర్టు మండిపడింది. ఇకపై ఇదే తరహాలో  వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించింది. వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే అరెస్ట్‌ వారెంట్‌(Arrest Warrant) జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై అఖ్తర్ తరఫు న్యాయవాది జే భరద్వాజ్ కోర్టులో అభ్యంతరం తెలుపడంతో తాజా హెచ్చరిక చేసింది. 

Also Read: Oscar Fernandes: కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూత

కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ,  కంగనా  సినిమా యాక్టింగ్‌, ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉండటంతో పాటు,   కొన్ని లక్షణాల కారణంగా కోవిడ్ పరీక్ష చేయించుకోనున్నారని, ఒకవేళ పాజిటివ్‌ వస్తే  మరింత మినహాయింపు అవసరం ఉంటుందని కోర్టుకు తెలపడం గమనార్హం. 

కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) మరణానంతరం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారని జావేద్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కంగనా. అయితే కంగనా పిటిషన్‌ను బాంబే  హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News