Mrunal Thakur: బల్కంపేట్ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur: టాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హైదరాబాద్‌ బల్కంపేటలో కొలువైన రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 25, 2024, 11:12 AM IST
Mrunal Thakur: బల్కంపేట్ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకున్న మృణాల్ ఠాకూర్..

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్.. తెలుగులో 'సీతారామం' సినిమాతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ సినిమా తర్వాత నాని హీరోగా నటించిన 'హాయ్ నాన్న' మూవీతో పలకరించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'ఫ్యామిలీ స్టార్' మూవీ చేసింది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కంప్లీటైన సందర్భంగా చిత్ర యూనిట్ గుమ్మడికాయ కొట్టేసింది. ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు జరగుతున్నాయి. ఈ సందర్బంగా ఈ సినిమా హిట్ కావాలని ఇందులో కథానాయికగా నటించిన 'మృణాల్ ఠాకూర్' హైదరాబాద్ బల్కంపేటలో కొలువైన రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి ముడుపులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమం తర్వాత ఆలయ పూజారులు మృణాల్ ఠాకూర్‌ను అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.

ఇక తాను అమ్మవారిని దర్శించుకున్నట్టు మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక 'సీతారామం', హాయ్ నాన్న వరుస సక్సెస్‌లతో మృణాల్ ఠాకూర్ తన పారితోషకాన్ని అమాంతం పెంచేసింది. టెలివిజన్ సీరియల్స్‌తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్.. మరాఠీ సినిమా 'విట్టి దండు' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత మరాఠీ హిందీ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.  

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)

ఈమె తెలుగుతో పాటు హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అటు 'లస్ట్ స్టోరీస్ 2' లో ఈమె నటకు మంచి మార్కులే పడ్డాయి. వరుసగా తెలుగులో ప్యాన్ ఇండియా చిత్రాలు చేస్తోన్న ఈమె ఇక్కడ ఓ ఇల్లను కొనుక్కున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో తమిళం, మలయాళ చిత్రాల్లో కూడా ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి.

Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News