Upcoming Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే...!

Upcoming Movies: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు(Theaters) తెరుచుకున్నాయి. మరో వైపు కొత్త సినిమాలతో ఓటీటీ(OTT)లు తళుక్కున మెరుస్తున్నాయి. మరి ఈ వారంలో అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలు ఏంటో చూసేద్దామా!  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 12:54 PM IST
Upcoming Movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు ఇవే...!

Upcoming Movies: దసరాకి థియేటర్లు(Theaters), ఓటీటీ(OTT)ల్లో సందడి చేయడానికి పలు చిత్రాలు రెడీ అవుతున్నాయి. ఈ సారి పండగకు అగ్రహీరోలు ఎవరూ బరిలోకి దిగడం లేదు. కానీ కుర్ర హీరోలు మాత్రం పోటీకి దిగుతున్నారు.

మహా సముద్రం
హీరోలు సిద్ధార్థ్‌, శర్వానంద్‌(sharwanand) స్నేహితులుగా కలిసి నటిస్తున్న చిత్రమిది. అదితీ రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోహీరోయిన్లు. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రావు రమేశ్‌, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 14న థియేటర్‌లో విడుదల కానుంది.

Also Read: Mohan Babu press meet: నన్ను రెచ్చగొట్టాలని చూశారు.. MAA Elections పై మోహన్ బాబు స్పందన

మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ 
అఖిల్‌(akhil), పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం '‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన లభించింది. అక్టోబరు 15న దసరా పండగ(Dussehra Festival) కానుకగా విడుదలవుతోంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకుడు. గోపిసుందర్‌ అందించిన బాణీలు యువతను అమితంగా ఆకట్టుకున్నాయి.

పెళ్లిసందD
శ్రీకాంత్ తనయుడు రోషన్‌(Roshan‌) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘'పెళ్లిసందD'. గౌరి రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. రాఘవేంద్రరావు(Raghavendra Rao) పర్యవేక్షణలో తెరకెక్కింది. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇది కూడా దసరా కానుకగా అక్టోబరు 15న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి సంగీతమందించిన కీరవాణి(Keeravani) ఈ సినిమాకు కూడా పనిచేశారు. చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. ఈ సినిమాతోనే దర్శకేంద్రుడు నటుడిగా మారి, ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

*వెనమ్‌: లెట్‌ దేర్‌ బీ కార్నేజ్‌

ఓటీటీలో అలరించనున్న చిత్రాలు

సర్దార్‌ ఉద్దమ్
విక్కీ కౌశల్‌(Vicky Koushal) కీలక పాత్రలో సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్‌ డ్రామా ‘'సర్దార్ ఉద్దమ్‌'’. విక్కీ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరు 16న ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.

రష్మీరాకెట్‌
‘థప్పడ్‌’, ‘హసీనా దిల్‌రుబా’, ‘అనబెల్‌ సేతుపతి’.. ఇలా వరుస ఓటీటీ రిలీజ్‌లతో దూసుకెళ్తున్నారు నటి తాప్సీ పన్ను. తాజాగా ‘రష్మీరాకెట్‌’తో ఓటీటీ(OTT) వేదికగా మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఆమె ప్రధానపాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ఈ నెల 15న జీ5 ఓటీటీ వేదికగా విడుదలవుతుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో తాప్సీ గుజరాత్‌ అథ్లెట్‌ రష్మీ పాత్రలో కనిపించనున్నారు. ఆకర్ష్‌ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 

Also read: Evaru Meelo Koteeswarlu: సమంత ప్రొమో వచ్చేసింది..తారక్ పై సామ్ సీరియస్

నెట్‌ఫ్లిక్స్‌
* ది ఫోర్‌ ఆఫ్‌ అజ్‌ -   అక్టోబరు 15
* ది ట్రిప్‌   -   అక్టోబరు 15
* లిటిల్‌ థింగ్స్‌  - అక్టోబరు 15
* యు  -  అక్టోబరు 15

అమెజాన్‌ ప్రైమ్‌
* రక్తసంబంధం -  అక్టోబరు 14
* ఫ్రెండ్‌షిప్ - అక్టోబరు 15
* ఐనో వాటు యు డిడ్‌ లాస్ట్‌ సమ్మర్‌ - అక్టోబరు 15

డిస్నీ ప్లస్‌హాట్‌ స్టార్‌
* సీటీమార్‌ - అక్టోబరు 15
* ఫ్రీ గై - అక్టోబరు 15
* సనక్‌ - అక్టోబరు 15 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News