Malli Pelli On OTT: ఇవాళ్టి రాత్రి నుంచే ఓటిటిలోకి రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Malli Pelli On OTT: ఆడియెన్స్‌ని అలరించేందుకు ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ అయిన ఆహా, డిస్నీ హాట్ స్టార్, సోని లివ్, జీ5 మాధ్యమాల్లో కొత్తగా నేటి అర్ధరాత్రి నుంచి యాడ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌ల జాబితా ఇలా ఉంది. ఈ జాబితాలోనే మళ్లీ పెళ్లి, కిసి కా భాయ్ కిసి కా జాన్ వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇదిగో.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2023, 10:04 AM IST
Malli Pelli On OTT: ఇవాళ్టి రాత్రి నుంచే ఓటిటిలోకి రానున్న ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు

Malli Pelli On OTT: ఆడియెన్స్‌ని అలరించేందుకు ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫామ్స్ అయిన ఆహా, డిస్నీ హాట్ స్టార్, సోని లివ్, జీ5 మాధ్యమాల్లో కొత్తగా 5 సినిమాలు యాడ్ అవుతున్నాయి. అందులో ఇటీవల వివాదాలు, నటుడు నరేష్ భార్య రమ్య రఘుపతి పెట్టిన కేసులు, నరేష్ - పవిత్ర లోకేష్ ప్రేమాయాణంతో తెరపైకొచ్చిన మళ్లీ పెళ్లి సినిమాతో పాటు అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఏజెంట్ మూవీ, మళయాళం దర్శకుడు అహ్మెద్ కబీర్ తెరకెక్కించిన కేరళ క్రైమ్ ఫైల్స్ అనే వెబ్ సిరీస్ సహా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డె ప్రధాన పాత్రల్లో వచ్చిన కిసి కా భాయ్ కిసి కా జాన్ మూవీ, ఇంటింటి రామాయణం వంటి వినోదభరిత చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

1) మళ్ళీ పెళ్లి :
నరేష్, పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా కథాంశం వారి రియల్ స్టోరీనే అనే ప్రచారం జరిగింది. నరేష్ కి, ఆయన భార్య రమ్య రఘుపతికి మధ్య ప్రస్తుతం విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది. ఇదిలావుండగానే నరేష్, పవిత్ర లోకేష్‌తో ప్రేమలో పడ్డాడు. వీళ్లిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ మళ్ళీ పెళ్లి మూవీ తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 23 నుంచి ఆహాలో ప్రసారం కానుంది.

2) కేరళ క్రైమ్ ఫైల్స్ :
మళయాళ దర్శకుడు అహ్మెద్ ఖబీర్ తొలిసారిగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ఇది. ఒక లాడ్జిలో జరిగిన దారుణ హత్య వెనుకున్న కారణాలను వెలికి తీసే క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలు, బయటపడిన మరిన్ని రహస్యాల సారాంశమే కేరళ క్రైమ్ ఫైల్స్. కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జూన్ 23 నుంచే అందుబాటులోకి రానుంది.

3) ఏజెంట్ మూవీ : 
అఖిల్ అక్కినేని, మళయాళం మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఏజెంట్ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. థియేటర్ వెర్షన్ కాకుండా ఓటిటి వెర్షన్ ని ప్రత్యేకంగా ఎడిట్ చేసి సోని లివ్ ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు.

4) కిసికా భాయ్.. కిసికా జాన్  :
సల్మాన్ ఖాన్, పూజా హెగ్డె జంటగా వచ్చిన ఈ సినిమా జీ5 లో జూన్ 23 నుంచే.. అంటే నేటి అర్ధరాత్రి నుంచే అందుబాటులోకి రానుంది. 2014 లో అజిత్ కుమార్, తమన్నా భాటియా జంటగా వచ్చిన వీరం అనే తమిళ చిత్రం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను ఫరద్ సమ్జి డైరెక్ట్ చేశాడు. 

ఇది కూడా చదవండి : Adipurush 6th Day Collections: ఆదిపురుష్ 6వ రోజు కలెక్షన్స్.. అంతంత మాత్రంగానే!

5) ఇంటింటి రామాయణం :
రాహుల్ రామకృష్ణ, నవ్య స్వామి, నరేష్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఇంటింటి రామాయణం మూవీ థియేట్రికల్ రిలీజ్ తరువాత రెండు వారాలకు ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా కూడా నేటి అర్ధరాత్రి నుంచే ఆహాలో వ్యూయింగ్‌కి అందుబాటులోకి రానుంది.

ఇది కూడా చదవండి : Sofia Ansari Latest Pics: ఇంస్టాగ్రామ్‌ చిట్ చాట్‌ లైవ్‌లో బట్టలు చెంజ్‌ చేసుకున్న సోఫియా అన్సారీ..వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News