Naga Srinu vs Mohan babu: నన్ను ఇక విడిచిపెట్టరా.. మోహన్ బాబుపై నాగ శ్రీను సంచలన వ్యాఖ్యలు

Naga Srinu sensational comments on Mohan babu: నాగ శ్రీను.. ఈ పేరు వినగానే ఆ వెంటనే గుర్తుకొచ్చే మరో పేరు ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు. అవును.. మోహన్ బాబు పర్సనల్ హెయిర్ స్టైలిష్ట్‌గా 11 ఏళ్ల పాటు ఆ కుటుంబంలో ఒకరిగా తిరిగిన వ్యక్తి నాగశ్రీను. మోహన్ బాబు వద్ద పనిచేసినంత కాలం ఎవ్వరికీ తెలియని ఈ నాగ శ్రీను పేరు ఆ తర్వాతే చాలా పాపులర్ అయింది.

Written by - Pavan | Last Updated : Apr 16, 2022, 08:43 PM IST
  • మోహన్ బాబు vs నాగ శ్రీను ఎపిసోడ్‌లో ఎన్నో ట్విస్టులు
  • నాగ శ్రీనుకు నాయి బ్రాహ్మణ సంఘాలు నుంచి మద్దతు
  • మరోసారి జీ మీడియాను ఆశ్రయించిన నాగ శ్రీను ఈసారి ఏం చెబుతున్నాడు ?
  • పూర్తి డీటేల్స్ కోసం నాగశ్రీను ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ వీడియో చూడాల్సిందే
Naga Srinu vs Mohan babu: నన్ను ఇక విడిచిపెట్టరా.. మోహన్ బాబుపై నాగ శ్రీను సంచలన వ్యాఖ్యలు

Naga Srinu sensational comments on Mohan babu: నాగ శ్రీను.. ఈ పేరు వినగానే ఆ వెంటనే మొదటిగా గుర్తుకొచ్చే మరో పేరు ప్రముఖ సినీనటుడు మంచు మోహన్ బాబు. అవును.. మోహన్ బాబు పర్సనల్ హెయిర్ స్టైలిష్ట్‌గా 11 ఏళ్ల పాటు ఆ కుటుంబంలో ఒకరిగా తిరిగిన వ్యక్తి నాగశ్రీను. మోహన్ బాబు వద్ద పనిచేసినంత కాలం ఎవ్వరికీ తెలియని ఈ నాగ శ్రీను పేరు ఆ తర్వాతే చాలా పాపులర్ అయింది. అందుకు కారణం నాగ శ్రీను తమ ఇంట్లో దొంగతనం చేశాడంటూ మోహన్ బాబు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం కొంతయితే.. ''నేనా దొంగతనం చేయలేదు మహా ప్రభో'' అంటూ నాగ శ్రీను మీడియా కెమెరాలకు బైట్లు ఇస్తూ స్టూడియోలకెక్కడం మరో కారణమైంది. ఈ క్రమంలో నాగ శ్రీను అసలు నేరం చేశాడా లేదా అనే సంగతిని కాసేపు పక్కనపెడితే.. ఇరువురూ ఒకరిపై మరొకరు పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. 

మోహన్ బాబు తనపై దొంగ అనే ముద్ర వేయడంతో పాటు నన్ను మోకాళ్లపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారని.. అంతటితో ఆగకుండా తన తల్లిని కూడా దూషించారని నాగ శ్రీను మీడియా ఎదుట వాపోయారు. అదే సమయంలో మోహన్ బాబు గురించి నాగ శ్రీను చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి. ఈ వివాదాన్ని ఆది నుంచి నిశితంగా పరిశీలిస్తూ వస్తోన్న జీ తెలుగు న్యూస్.. అసలు ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా పలు వార్తా కథనాలు ప్రసారం చేయడంతో పాటు డిబేట్ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. 

అదే సమయంలో మోహన్ బాబు vs నాగ శ్రీను అన్నట్టుగా జరిగిన ఈ వివాదంలో నాగ శ్రీనుకు నాయి బ్రాహ్మణ సంఘాలు నుంచి భారీ మద్దతు లభించింది. తమను, తమ కులాన్ని కించపరిచేలా వ్యవహరించే హక్కు మోహన్ బాబుకు ఎవరు ఇచ్చారంటూ నాయిబ్రాహ్మణ సంఘాలు పలు చోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపాయి. మోహన్ బాబు కుటుంబానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. మోహన్ బాబు తమకు క్షమాపణలు చెప్పకపోతే తమ నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇదంతా పక్కనపెడితే నాగశ్రీను తాజాగా మరోసారి జీ మీడియాను ఆశ్రయించాడు. ''నాపాటికి నన్ను బతకనివ్వండి'' అంటూ నాగశ్రీను జీ న్యూస్ తెలుగు ద్వారా వేడుకుంటున్నాడు. జీ మీడియాతో నాగశ్రీను ఏయే విషయాలు వెల్లడించాడు ? ఇంతకీ ప్రస్తుతం నాగశ్రీను పరిస్థితేంటి ? నాగ శ్రీను అజ్ఞాతంలోకి ఎందుకెళ్లాడు ? ఏం చేస్తున్నాడు ? నాగశ్రీనుపై నమోదైన కేసు విచారణ ఎంత వరకు వచ్చింది ? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడంతో పాటు అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే.. ఇదిగో నాగశ్రీను ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ వీడియో చూడాల్సిందే.

Trending News