Mister Pregnant OTT: ఓటీటీలోకి రాబోతున్న 'మిస్టర్ ప్రెగ్నెంట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Mister Pregnant on OTT: మేల్ ప్రెగ్నెన్సీ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ ప్రెగ్నెంట్'. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. ఇది ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 28, 2023, 09:28 PM IST
Mister Pregnant OTT: ఓటీటీలోకి రాబోతున్న 'మిస్టర్ ప్రెగ్నెంట్'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Mister Pregnant OTT Release Date: బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ లీడ్ రోల్ లో నటించిన మూవీ 'మిస్టర్ ప్రెగ్నెంట్'(Mister Pregnant). డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. మిక్సడ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయింది. ఈ సినిమా డిజటల్ రైట్స్ ను తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా దక్కించుకుంది. ఈ చిత్రాన్ని అక్టోబరు 06 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఇవాళ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 

"మిస్టర్ ప్రెగ్నెంట్. వినడానికే కొత్తగా ఉంది కదా. ఎంటర్‌టైన్మెంట్ కూడా కొత్తగా ఉంటుంది. ఎమోషనల్ డ్రామా కోసం రెడీగా ఉండండి. మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ అక్టోబర్ 6న ప్రీమియర్ ఉంటుంది" అని ఆహా ఓటీటీ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో సోహెల్ కు జోడిగా రూపా కొడువాయూర్ నటించింది. ఈ మూవీలో సుహాసిని మణిరత్నం, రజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, వైవా హర్ష, అభిషేక్ రెడ్డి, స్వప్నిక తదితరులు కీ రోల్స్ చేసారు. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పి రెడ్డి, రవీరెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అంతేకాకుండా ఈయన స్క్రీన్‍ప్లే కూడా అందించారు. 

టాటూ ఆర్టిస్ట్ అయిన గౌతమ్, మహీ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే గౌతమ్ కు పిల్లలంటే ఇష్టముండదు. అందుకే వారిద్దరూ పిల్లలు వద్దనుకుంటారు. ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కడవుతారు. ఇదే సమయంలో వారి జీవితాలు మలుపు తిరుగుతాయి. గౌతమ్ ప్రెగ్నెంట్ అవుతాడు. అతడు ప్రెగ్నెంట్ ఎలా అయ్యాడు? దాని తర్వాత అతడు ఎదుర్కొన్న పరిణామాలు ఏంటి? అనే ఆంశాలపై ఈ మూవీ తెరకెక్కింది. 

Also Read: Michael Gambon: హ్యారీ పోటర్‌ నటుడు మైఖేల్‌ గాంబోన్‌ కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News