Samantha-Amala: మినిమం కామన్ సెన్స్ లేదా.. అక్కినేని అమలను ఆటాడుకుంటున్న నెటిజన్స్!

Amala Akkineni does not have Minimum Common Sense trolls Samantha Ruth Prabhu Fans. సాటి ఆడదానిగా సమంతను పరామర్శించవా అంటూ అక్కినేని అమలపై సమంత ఫ్యాన్స్ నెట్టింట మండిపడుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 4, 2022, 12:17 PM IST
  • మినిమం కామన్ సెన్స్ లేదా
  • అమలను ఆటాడుకుంటున్న నెటిజన్స్
  • నాగ చైతన్య స్పందన కోసం
Samantha-Amala: మినిమం కామన్ సెన్స్ లేదా.. అక్కినేని అమలను ఆటాడుకుంటున్న నెటిజన్స్!

Netizens trolls Amala Akkineni over Not react on Samantha Ruth Prabhu health condition: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు  సామ్‌ స్వయంగా తెలిపారు. విషయం తెలిసిన అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమంత త్వరగా కోలుకుకోవాలని కోరుకుంటూ ఫ్యాన్స్‌, సినీ సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. సమంత అనారోగ్య పరిస్థితిపై చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, అక్కినేని అఖిల్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, కీర్తి సురేశ్‌తో పాటు పలువురు స్పందించారు. 

సమంత అనారోగ్యంపై అక్కినేని ఫామిలీ నుంచి అఖిల్ తప్పిస్తే.. నాగార్జున, నాగచైతన్య, అమల స్పందించలేదు. దీంతో తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీపై నెగిటివ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . నాగచైతన్య, నాగార్జున రియాక్ట్ కాకపోయినా.. సాటి ఆడదానిగా సమంతను పరామర్శించవా అంటూ అక్కినేని అమలపై సమంత ఫ్యాన్స్ నెట్టింట మండిపడుతున్నారు. 'మినిమం కామన్ సెన్స్ లేదా', 'జంతు ప్రేమికురాలివి అయిన నువ్.. సామ్‌ను పరామర్శించావా' అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

సోషల్ మీడియాలో ట్వీట్ చేయకుంటే అక్కినేని అమలపై లేనిపోని అబాండాలు వేయొద్దని అక్కినేని ఫాన్స్ అంటున్నారు. ట్వీట్ చేస్తేనే పరామర్శించినట్టా.. నేరుగా సమంతను కలిసుండొచ్చు కదా అని వారు మద్దతు ఇస్తున్నారు. మరోవైపు నాగచైతన్య తల్లి లక్ష్మి మాత్రం సమంతను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారట. అక్కినేని హీరో సుశాంత్‌, విక్టరి వెంకటేశ్‌ కూతురు అశ్రిత కూడా సామ్‌ పోస్ట్‌పై స్పందించాడు. ఇక సామ్‌ ఆనారోగ్యంపై ఆమె మాజీ భర్త, హీరో నాగ చైతన్య స్పందన కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Also Read: PAK vs SA T20 World Cup: ఒకే బంతికి రెండుసార్లు ఔట్.. ఐసీసీ రూల్స్ తెలియక పెవిలియన్‌కు వెళ్లిపోయిన పాక్ బ్యాట్స్‌మెన్   

Also Read: Madhya Pradesh: బస్సు, టవేరా ఢీ... 11 మంది దుర్మరణం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News