Actress Anaya Soni Faints: టీవీ నటి కిడ్నీ ఫెయిల్.. సీరియల్ సెట్స్ లోనే అపస్మారక స్థితికి.. ఆర్ధిక సాయం కోసం ఎదురుచూపులు!

Actress Anaya Soni Kidney Failure: హిందీ టీవీ నటి అనయ సోనీ అస్వస్థతకు గురైంది. కిడ్నీ ఫెయిల్ కావడంతో సీరియల్ సెట్స్ లోనే కళ్లు తిరిగి పడిపోయింది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 3, 2022, 09:10 AM IST
  • టీవీ నటి అనయ సోనీ కిడ్నీ ఫెయిల్..
  • సీరియల్ సెట్స్ లోనే అపస్మారక స్థితికి అనయ సోనీ
  • ఆర్ధిక సాయం అనయ సోనీ కోసం ఎదురుచూపులు
 Actress Anaya Soni Faints: టీవీ నటి కిడ్నీ ఫెయిల్.. సీరియల్ సెట్స్ లోనే అపస్మారక స్థితికి.. ఆర్ధిక సాయం కోసం ఎదురుచూపులు!

Mere Sai Actress Anaya Soni Kidney Failure and Faints On Sets: సినీ పరిశ్రమ తరువాత ఎక్కువగా టీవీ పరిశ్రమలో నటీనటులు నాలుగు రాళ్లు వెనకేసుకునే ప్రయత్నం చేస్తూ  ఉంటారు. అయితే బయట నుంచి చూడడానికి అంతా బాగానే ఉంటుంది కానీ టీవీ పరిశ్రమలో పనిచేస్తున్న నటీనటుల జీవితం కూడా చాలా కష్టంగా ఉంది. సినిమాలతో పోలిస్తే సీరియల్స్ నిడివి చాలా ఎక్కువ. అందుకే సీరియల్స్ షూటింగ్ కూడా సుదీర్ఘంగా సాగుతూ ఉంటుంది.

సమయం సందర్భంగా కూడా లేకుండా వారి షూటింగ్స్ సుదీర్ఘంగా సాగుతూ ఉంటాయి. ఆ షూట్స్ వారి ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇటీవల ఇలాంటి ఘటనే ఒకటి తెర మీదకు వచ్చింది. ఒక టీవీ నటి తన పరిస్థితి చాలా విషమంగా ఉందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'మేరే సాయి' అనే సీరియల్ లో కీలక పాత్ర పోషించిన నటి అనయ సోనీ ఇటీవల అస్వస్థతకు గురై, ఆ తర్వాత ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. అనయ సోనీ 'మేరే సాయి' సెట్స్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆ సీరియల్ యూనిట్ అనయ సోనీని వెంటనే ఆసుపత్రికి తరలించి షూటింగ్‌ను నిలిపివేసింది.

అయితే అనయ సోని పరిస్థితి బాగోలేదని స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అనన్య సోనీ తండ్రి, అలాగే ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ల ప్రకారం, అనన్య సోనీ కిడ్నీ ఒకటి పాడైందని చెబుతున్నారు. ఇక ఆమె కిడ్నీని మార్చాల్సి ఉంటుందని అంటున్నారు. అనయ సోని ప్రస్తుతం డయాలసిస్‌లో ఉన్నారు. ఇక అనయ సోని ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అలాగే ఆమె తండ్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అనయ చికిత్స చేయించుకోవడానికి సరిపడా డబ్బు లేదని, కిడ్నీ మార్పిడికి, డయాలసిస్‌కు డబ్బులు ఎక్కడి నుంచి తేవాలో ఆరడం కావడం లేదని అనయ సోని తండ్రి ఆందోళన చెందుతున్నారు.  

అనయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి తన ఆరోగ్యం గురించి చెప్పింది. 'నా కిడ్నీ ఫెయిల్ అయిందని, నాకు డయాలసిస్ చేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. నా క్రియాటినిన్ 15.67కి, హిమోగ్లోబిన్ 6.7కి తగ్గింది. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది, సోమవారం నుండి, నేను అంధేరీ ఈస్ట్‌లో ఉన్న హోలీ స్పిరిట్ హాస్పిటల్‌లో చేరాను, నా కోసం ప్రార్థించండి, జీవిత ప్రయాణం నాకు సులభం కాదు. కానీ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ, తేలికగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’ అంటూ ఆమె ఒక సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసింది. త్వరలో కిడ్నీ మార్పిడి చేయించుకుంటానన్న ఆమె డయాలసిస్ తర్వాత కిడ్నీ మార్పిడికి దరఖాస్తు చేసుకుంటానని పేర్కొంది.

ఇక అనయ సోనీ ఇంతకుముందు కూడా జూలైలో తన చికిత్స కోసం ప్రజల నుంచి సహాయం కోరింది. సామాజిక మాధ్యమాల ద్వారానే ఆమె ఆర్థిక సాయం కోరారు. ఆమె 2015 నుంచి కేవలం ఒక కిడ్నీతోనే జీవిస్తున్నట్లు అప్పుడు వెల్లడించింది. కొన్నేళ్ల క్రితం అనయ సోనీకి రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆమె తండ్రి ఆమెకు ఒక కిడ్నీ దానం చేశారు. అయితే అనయ సోనీకి తండ్రి దానం చేసిన కిడ్నీ కూడా ఇప్పుడు పాడైపోయింది. దీంతో అనయ సోనీకి మళ్లీ కిడ్నీ మార్పిడి చేయాల్సి వచ్చింది. 'మేరే సాయి' కాకుండా, అనయ సోని కొన్ని ఇతర టీవీ సీరియల్స్ లో కూడా నటించింది. 'ఇష్క్ మే మర్జవాన్', 'హై అప్నా దిల్ తో ఆవారా', 'నామ్‌కారన్', 'క్రైమ్ పెట్రోల్' సహా  'అదాలత్' వంటి సీరియల్స్ లో ఆమె నటించింది. 
Also Read: Adipurush Teaser : రాముడిగా మెప్పించిన ప్రభాస్.. ఆ షాట్స్‌కు దండం పెట్టాల్సిందే

Also Read: Adipurush Teaser : ఆదిపురుష్ టీజర్‌పై ట్రోల్స్.. అదొక్కటే మైనస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News