Warning to Balakrishna: బాలకృష్ణను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన మతిస్థిమితం లేని వ్యక్తి.. ఏం ప్రమాదం జరగబోతోంది?

Warning to Balakrishna:  తారకరత్న పార్థివదేహం వద్ద ఉండగా ఒక మతిస్థిమితం లేని వ్యక్తి బాలకృష్ణ దగ్గరకు వెళ్లి పెద్ద పెద్దగా మాట్లాడుతూ జాగ్రత్త బాలయ్య అంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 20, 2023, 09:36 PM IST
Warning to Balakrishna:  బాలకృష్ణను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన మతిస్థిమితం లేని వ్యక్తి.. ఏం ప్రమాదం జరగబోతోంది?

Mentally Disabled Person Warns Balakrishna: నందమూరి తారకరత్న అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియల కోసం ముందుగా పార్థివదేహాన్ని హైదరాబాదులోని ఆయన నివాసానికి అక్కడి నుంచి ఫిలిం ఛాంబర్ కు తరలించారు. ఫిలిం చాంబర్లో ఆయన పార్థివదేహాన్ని సందర్శకుల కోసం ఉంచిన సమయంలో ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఆ ప్రాంగణంలోకి అడుగు పెట్టాడు. ప్రాంగణంలోకి అడుగు పెట్టడమే కాదు తారకరత్న పార్థివదేహానికి సందర్శించి నివాళులర్పించాడు.

ఆ తరువాత నందమూరి బాలకృష్ణ దగ్గరకు వెళ్లి పెద్ద పెద్దగా మాట్లాడుతూ జాగ్రత్త బాలయ్య అంటూ హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై అతనిని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లారు. అయితే అసలు ఎందుకు ఈ మతిస్థిమితం లేని వ్యక్తి నంద మూరి బాలకృష్ణను జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు అని చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. సాధారణంగా ఇలాంటి విషయాలు ఎక్కువగా సినిమాల్లోనే జరుగుతూ ఉంటాయి.

పిచ్చివారిలా కనిపించే మేధావులు రాబోయే ఆపదలను ముందుగానే ఊహించి హెచ్చరించడం వంటి ఘటనలు సినిమాల్లో మాత్రమే చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు బాలకృష్ణ విషయంలో ఇలా జరగడంతో అభిమానులందరూ నందమూరి బాలకృష్ణకు ఏం జరగబోతోంది? అంటూ టెన్షన్ పడుతున్న వాతావరణం కనిపిస్తోంది. అయితే అక్కడున్న పోలీసులు మాత్రం అతను పిచ్చివాడని ఫిలింనగర్ చుట్టుపక్కల అలాగే తిరుగుతూ ఉంటాడని ఎవరైనా ఇంత పెడితే తిని ఆ చుట్టుపక్కలే ఉంటాడని చెబుతున్నారు.

అతని మాటలను అసలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదని పోలీసులు చెబుతున్నారు. కానీ నందమూరి బాలకృష్ణ అభిమానులు మాత్రం ఇలా వచ్చి నేరుగా చెప్పాడు అంటే ఏదో జరగబోతుందని భయపడుతున్నారు. ఇప్పటికే వరుస మరణాలతో బాధపడుతున్న నందమూరి కుటుంబానికి ఈ మతిస్థిమితం లేని వ్యక్తి హెచ్చరిక మరింత టెన్షన్ పెడుతోంది అని చెప్పక తప్పదు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.

Also Read: Vinaro Bhagyamu Vishnu Katha: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..కిరణ్ అబ్బవరం సినిమాకు బంపర్ ఆఫర్!

Also Read: Chiranjeevi Bholaa Shankar: పవన్ ఫ్యాన్ గా చిరు.. ఇదేదో మాములుగా లేదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News