Twiitter Account: ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ భార్య సురేఖ, తొలి పోస్ట్‌తోనే వైరల్

Twiitter Account: సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల సందడి ఎక్కువే ఉంటుంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడాయన సతీమణి కూడా ఎంట్రీ ఇచ్చేశారు. తొలి పోస్ట్ ఏం పెట్టారంటే..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2022, 08:30 PM IST
Twiitter Account: ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ భార్య సురేఖ, తొలి పోస్ట్‌తోనే వైరల్

Twiitter Account: సోషల్ మీడియాలో టాలీవుడ్ సెలెబ్రిటీల సందడి ఎక్కువే ఉంటుంది. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవాలంటే మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడాయన సతీమణి కూడా ఎంట్రీ ఇచ్చేశారు. తొలి పోస్ట్ ఏం పెట్టారంటే..

సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకునేది సినీ ప్రముఖులే. టాలీవుడ్ సెలెబ్రిటీలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటారు. సోషల్ మీడియా వేదికగా వివిధ రకాల పోస్టులతో సందడి చేస్తుంటారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవల్సిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలో ఎలాగైతే అగ్రస్థానం సాధించారో..అదే విధంగా సోషల్ మీడియాలో కూడా చిరంజీవి టాప్ అని చెప్పవచ్చు. ఒక్క ట్విట్టర్‌లోనే చిరుకు 1.2 మిలియన్ల ఫాలోవర్లున్నారు. ఇక అతని తనయుడు రామ్‌చరణ్‌కు 2 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు. ఇక చిరు మేనల్లుడు అల్లు అర్జున్‌కు ఏకంగా 6.5 మిలియన్ల ఫాలోవర్లున్నారు. 

ఎప్పటికప్పుడు సినిమాలకు సంబంధించి అప్‌డేట్స్ లేదా సరదా సన్నివేశాలు, గుర్తుంచుకోవల్సిన అంశాలు, లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేందుకు సోషల్ మీడియా ఓ అనువైన వేదిక. ఇంతలా ఉన్నా సినీ కుటుంబానికి చెందిన కొందరు ఇంకా ఎక్కౌంట్ చేయని పరిస్థితి ఉంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ వంతు వచ్చింది

భర్త అడుగుజాడల్లో నడుస్తూ..సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ ఎక్కౌంట్ ఓపెన్ చేసి తొలి పోస్ట్ షేర్ చేశారు. తొలి పోస్ట్‌లో భాగంగా తన కొడుకుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. తన సూపర్ స్టైలిష్ కొడుకు రామ్‌చరణ్ ఫోటోను ఫస్ట్ ఫోటోగా ట్విట్టర్‌లో చేరినందుకు ఆనందంగా ఉందంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అప్పుడే 2 వేలమంది ఫాలోవర్లు చేరిపోయారు సురేఖకు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ అవుతోంది. 

Also read: Samantha saree looks: చీరకట్టులో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా సమంత- ట్రెండ్ అవుతున్న ఫొటోలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News