GodFather Update: సల్మాన్ తో కలిసి చిందేయనున్న చిరు.. కన్నుల పండుగే అంటూ ట్వీట్

Chiranjeevi To Shake Leg With Salman Khan: తాజాగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరగబోతుండగా దానికి సంబంధించిన ఫోటోని మెగాస్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2022, 05:49 PM IST
  • సల్మాన్ ఖాన్ తో చిందేయనున్న మెగాస్టార్
  • ముంబై లో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్
  • ప్రభుదేవా న్నృత్య సారథ్యంలోమెగాస్టార్ చిరంజీవి , సల్మాన్ ఖాన్ డాన్సులు
GodFather Update: సల్మాన్ తో కలిసి చిందేయనున్న చిరు.. కన్నుల పండుగే అంటూ ట్వీట్

Chiranjeevi To Shake Leg With Salman Khan: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న సినిమాలలో గాడ్ ఫాదర్ సినిమా కూడా ఒకటి. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పాత్రలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ లో కూడా పాల్గొన్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరగబోతుండగా దానికి సంబంధించిన ఫోటోని మెగాస్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ తో సాంగ్ షూటింగ్ జరగబోతుందని, ప్రభుదేవా కొరియోగ్రఫీలో ఈ సాంగ్ షూటింగ్ మొదలు కాబోతుంది అంటూ చిరంజీవి ప్రకటించారు.

ఈ సాంగ్ షూట్ ముంబైలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో నయనతార సత్యదేవ్ భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. నయనతార మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. తమన్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తుండగా డైరెక్టర్ పూరి జగన్నాథ్‌, హీరో సత్యదేవ్‌, నటుడు సునీల్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రచంచవ్యాప్తంగా భారీస్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 

Also Read: Gully boys Riyaz: భార్యతో 'జీ తెలుగు జాతర'లో రచ్చ చేసిన రియాజ్.. ఎలా ఉందో చూశారా?

Also Read: Vijay Rashmika Love: రష్మికతో ప్రేమలో విజయ్ దేవరకొండ.. బయటపెట్టేసిన అనన్య పాండే.. ఇదిగో వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News