Megastar Chiranjeevi Back to Back Wrong Judgments: మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క తన కుమారుడు రామ్ చరణ్ చేత కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అని ఒక నిర్మాణ సంస్థ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తాను హీరోగా చేసే సినిమాల నిర్మాణాలు అన్నీ ఈ బ్యానర్ లోనే ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నాలు చేశారు. అయితే మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ కావడంతో పెట్టిన డబ్బులు అన్నీ వెనక్కి వచ్చాయి. కానీ తర్వాత నుంచి ఆయన జడ్జిమెంట్ మీద అనేక అనుమానాలు తలెత్తేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తన డ్రీం ప్రాజెక్టు అంటూ చేసిన సైరా నరసింహారెడ్డి సినిమా డిజాస్టర్ కాలేదు కానీ ఊహించిన ఫలితాలు మాత్రం అందుకోలేకపోయింది.
ఆ తర్వాత ఆయన హీరోగా రాంచరణ్ కీలకపాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య సినిమా మాత్రం తెలుగు సినీ పరిశ్రమలోనే భారీ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఇక ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లోనే మొట్టమొదటిసారిగా లాల్ సింగ్ చడ్డా అనే సినిమాను సమర్పిస్తున్నారు. అంటే మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా విషయంలో ఎలాంటి పెట్టుబడులు పెట్ట లేదు కానీ ఒక బాలీవుడ్ సినిమాని తెలుగులో విడుదల చేస్తున్న క్రమంలో తన పేరు కొంత దానికి బూస్త్ అయ్యే విధంగా అమీర్ ఖాన్ సహాయం అడిగితే సహాయం చేశారు. నిజానికి ఈ సినిమాని ముందుగానే అమీర్ ఖాన్ చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సుకుమార్ వంటి వారికి స్పెషల్ షో వేసి మరీ చూపించారు.
ఆ సినిమా చూసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్వయంగా దీన్ని తెలుగులో విడుదల చేయమని అడిగారని మీరు సమర్పిస్తానంటే చేస్తానని అమీర్ ఖాన్ చెప్పారని అప్పుడు చిరంజీవి సంతోషంగా విడుదల చేస్తానని చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా కధా, కధనం తెలుగు ప్రేక్షకులకు ఏమాత్రం కనెక్ట్ అవ్వదు అనే విషయం ఇట్టే అర్ధం అయిపోతుంది. మరి ఇలాంటి సినిమాని మెగాస్టార్ చిరంజీవి ఎలా ప్రమోట్ చేశారో ఆయనకే తెలియాలి. నిజానికి ఈ సినిమా అద్భుతంగా గనక ఉండి ఉంటే సినిమా చూసిన సమయంలో సుకుమార్, రాజమౌళి వంటి వారు తమ తమ సోషల్ మీడియా వేదికగా స్పందించి అప్పుడే సినిమాకు శుభాకాంక్షలు చెప్పేవారు.
కానీ సినిమా ఆకట్టుకోలేదు కాబట్టి వారు సైలెన్స్ పాటించారని అనుకోవచ్చు. కానీ మెగాస్టార్ జడ్జిమెంట్ల పదేపదే తప్పు అవడం ఆయన అభిమానులకు కూడా టెన్షన్ గానే ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు వరుస రీమేక్ సినిమాలు లైన్లో పెట్టారు. ఆయన చేస్తున్న రెండు రీమేక్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే ఆయన బాబీ దర్శకత్వంలో ఒక స్ట్రైట్ సినిమా చేస్తున్నారు. ఆయన జడ్జిమెంట్ ఇలా ఉంటే కనుక ఈ సినిమాల విషయంలో కూడా బోల్తాపడక తప్పదేమో అని అభిమానులు ఇప్పటినుంచే బాధపడుతున్నారు.
అంతేకాక మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య కొన్ని చిన్న సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు హాజరై వారికి బూస్ట్ అప్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆయన హాజరైన ఏ ఒక్క చిన్న సినిమా కూడా పూర్తిస్థాయి హిట్టు అనిపించుకోలేక పోయింది. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అవ్వాలంటే సినిమా చూడాల్సిన అవసరం లేదు కాబట్టి ఏదో మంచితనం కొద్దీ చేశారు అనుకోవచ్చు కానీ లాల్ సింగ్ లాంటి సినిమాను చూసిన తర్వాత కూడా ఎలా ప్రమోట్ చేయాలనిపించిందో ఆయనకే తెలియాలి అంటూ నెటిజన్లు పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవి తన జడ్జిమెంట్ విషయంలో పునరాలోచించుకోవాలని ఆయన అభిమానులైతే కోరుతున్నారు.
Also Read: Macherla Niyojakavargam: అమెరికా ప్రీమియర్ షోలన్నీ రద్దు.. అసలు ఏమైందంటే?
Also Read: Kushita Kallapu: రవితేజ కంట్లో పడి హీరోయిన్ గా మారిన బజ్జీల పాప!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.