Acharya second single : దీపావళి కానుకగా ‘ఆచార్య’ నుంచి నీలాంబరి పాట రిలీజ్‌

Acharya second single Neelambari on 5th november:ఆచార్య మూవీ నుంచి దీపావళి కానుకగా ఒక సర్‌‌ప్రైజ్‌ రానుంది. రామ్ చరణ్, పూజా హెగ్డే పాటకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఆచార్య (Acharya) మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘లాహే లాహే’ పాట మంచి ఆదరణ లభించింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ నీలాంబరి పాటకు (neelambari song) ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

Last Updated : Nov 2, 2021, 05:47 PM IST
  • 'ఆచార్య' మూవీ నుంచి అప్‌డేట్‌
  • దీపావళి కానుకగా సర్‌‌ప్రైజ్‌
  • ఆచార్య మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ నీలాంబరి పాట
  • నవంబర్ 5న ఉదయం 11.07నిమిషాలకు రిలీజ్‌
Acharya second single : దీపావళి కానుకగా ‘ఆచార్య’ నుంచి నీలాంబరి పాట రిలీజ్‌

Megastar Chiranjeevi And Ram Charans Acharya second single Neelambari on 5th november: మెగాస్టార్‌ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'ఆచార్య'. ఈ మూవీలో చిరంజీవికి (Megastar Chiranjeevi) జోడిగా కాజల్‌ నటించగా, మరో జంటగా చరణ్ - పూజ హెగ్డే అలరించనున్నారు. ఆచార్య మూవీ నుంచి దీపావళి కానుకగా ఒక సర్‌‌ప్రైజ్‌ రానుంది. రామ్ చరణ్, పూజా హెగ్డే పాటకు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే ఆచార్య (Acharya) మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘లాహే లాహే’ పాట మంచి ఆదరణ లభించింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్‌ నీలాంబరి పాటకు (neelambari song) ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ పాట నవంబర్ 5న ఉదయం 11.07నిమిషాలకు రిలీజ్‌ కానుంది. 

ఆచార్య సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) సరసన పూజా హెగ్డే (Pooja Hegde) నీలాంబరిగా పాత్రలో కనిపించనుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వీరిద్దరి పాత్రలు హైలెట్ అని టాక్.ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ (Siddha) పాత్రలో నటిస్తున్నారు. సిద్ధ సరసన నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే కూడా ఆకట్టుకోనుంది. 

 

Also Read : Huzurabad By Election Result Live Counting: కమలం జోరుకు 'కారు..బేజారు'..18వ రౌండ్లో 1,876 ఓట్ల ఆధిక్యం 

ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్‌లు మాజీ నక్సలైట్స్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి మణిశర్మ (Manisharma) సంగీతాన్ని అందించారు. అయితే ముందుగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయాలనుకున్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ ఆచార్య (Acharya) మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల చేయనున్నారు.

Also Read : Huzurabad by-poll result live updates: ఈటల రాజేందర్‌కి ఏయే ఎన్నికల్లో ఎంత మెజార్టీ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News