MegaFamilyRankuMogudu: మహేష్-మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధం.. రంకు మొగుడు అంటూ..!

Mahesh Babu and Mega Fans War over SVP 1st Day collection.'సర్కారు వారి పాట' మేకర్స్ ప్రకటించిన రూ.75 కోట్ల గ్రాస్ 'ఫేక్ వసూళ్లు' అంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో మహేష్ ఫాన్స్ రెచ్చిపోయారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 13, 2022, 09:58 PM IST
  • తొలిరోజు ఎస్‌వీపీ రికార్డు కలెక్షన్స్‌
  • మహేష్-మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధం
  • రంకు మొగుడు అంటూ..!
MegaFamilyRankuMogudu: మహేష్-మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధం.. రంకు మొగుడు అంటూ..!

War between Mahesh Babu and Mega Fans over Sarkaru Vaari Paata 1st Day collections: సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోని మరొక స్టార్ హీరో అభిమానులు ట్రోల్ చేయడం సర్వసాధారణమే. ఈ పద్ధతి ఇప్పట్లో వచ్చింది కాదు.. ఎప్పటినుంచో ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి కొనసాగుతోంది. మా హీరో గొప్ప అంటే.. మా హీరోనే గొప్ప అంటూ అభిమానులు కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సోషల్ మీడియా వచ్చాక ఓ హీరోపై ప్రశంసలు కురిపిస్తూ.. మరో హీరోపై విమర్శలు చేయడం ఎక్కువైంది. స్టార్ హీరోల సినిమాలు విడుదలైతే.. సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ మాటల యుద్ధం చేస్తున్నారు. ఒక్కో సమయంలో ఆ మాటలు హద్దులు కూడా దాటేస్తున్నాయి. తాజాగా మహేష్-మెగా ఫ్యాన్స్ మధ్య ఇదే జరిగింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మూవీ 'సర్కారు వారి పాట' భారీ అంచనాల మధ్య గురువారం (మే 12) విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు ఎస్‌వీపీ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ ఫుల్‌ బోర్డులు పడ్డాయి. రెండున్నర ఏళ్ల తర్వాత సూపర్ స్టార్ మహేశ్‌ నుంచి వచ్చిన సినిమా కావడంతో.. ఫాన్స్ థియేటర్‌కు బారులు తీరారు. దీంతో తొలి రోజు బాక్సాఫీస్‌ వద్ద ఎస్‌వీపీ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్‌ వసూల్ చేసింది. 

'సర్కారు వారి పాట' సినిమా తొలి రోజు ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడంలో 'ఆర్ఆర్ఆర్' తరువాత సర్కారు వారి పాటకే సాధ్యమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఎస్‌వీపీ సినిమా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో పేర్కొంది. ఆల్‌ టైమ్ రికార్డు అని కూడా ప్రకటించారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య గొడవకు కారణమైంది. మెగా-మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో మాటల యుద్దానికి తెరలేపారు. అంతేకాదు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. 

'సర్కారు వారి పాట' మేకర్స్ ప్రకటించిన రూ.75 కోట్ల గ్రాస్ 'ఫేక్ వసూళ్లు' (#SVPFakeCollections) అంటూ మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. దాంతో మహేష్ ఫాన్స్ రెచ్చిపోయారు. భీమ్లా నాయక్, ఆచార్య కంటే.. ఎస్‌వీపీనే తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిందని ట్వీట్స్ చేస్తున్నారు. అంతేకాదు మెగా ఫామిలీ రంకు మొగుడు (#MegaFamilyRankuMogudu) అంటూ కౌంటర్ ట్వీట్లు చేస్తున్నారు. దాంతో సోషల్ మీడియాలో మహేష్-మెగా ఫ్యాన్స్ మధ్య యుద్ధం సాగుతోంది. ఇవే కాకుండా చెప్పారాని, రాయలేని విధంగా కూడా ట్వీట్ల వర్షం కురుస్తోంది. మొత్తానికి ట్విట్టర్లో #MegaFamilyRankuMogudu అనే హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. 

Also Read: Acharya OTT Date: ఓటీటీలోకి 'ఆచార్య'.. 20 రోజులకే స్ట్రీమింగ్‌! నిరాశలో ఫాన్స్

Also Read: Kiara Advani Images: బ్లాక్ శారీలో కియారా అద్వానీ.. ఆ నడుమందాలు మాములుగా లేవుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News