Paruvu Web Series: నాగబాబులో కొత్త యాంగిల్.. పరువు వెబ్ సిరీస్ లో అదరగొట్టిన మెగా బ్రదర్..

Paruvu Web Series: నాగబాబు నటుడిగా నిర్మాతగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ఈయన ‘పరువు’ వెబ్ సిరీస్ లో నటించాడు. ఇందులో మెగాబ్రదర్ విలనిజం ఉన్న పాత్రలో నటించాడు. తాజాగా ఈ వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 14, 2024, 12:10 PM IST
Paruvu Web Series: నాగబాబులో కొత్త యాంగిల్.. పరువు వెబ్ సిరీస్ లో అదరగొట్టిన మెగా బ్రదర్..

Paruvu Web Series: నాగబాబు అటు సినిమాలు, వెబ్ సిరీస్ లతో పాటు రాజకీయాల్లో రాణిస్తున్నాడు. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే పలు సినిమాలు సీరియల్స్, వెబ్ సిరీస్ లలో యాక్ట్ చేస్తున్నారు. తాజాగా ఈయన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ మీద మెగాస్టార్ చిరంజీవి పెద్దల్లుడు విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల లగ్గిశెట్టి నిర్మించిన ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘పరువు’లో లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకులు. ఈ మూవీలో నాగబాబు, నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి వంటి వారు లీడ్ రోల్లో యాక్ట్ చేశారు. పవన్ సాధినేని షో రన్నర్‌గా వచ్చిన ఈ ZEE5 ఒరిజినల్ సిరీస్ జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ క్రమంలో ‘పరువు’ ప్రీ లాంచ్ ఈవెంట్‌ను గురువారం నాడు  ఘనంగా జరిగింది.

ఇందులో మొదటి ఎపిసోడ్‌ను అందరికీ ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో..

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘‘పరువు’ పైలెట్ ఎపిసోడ్ బాగుందంటున్నారు. గురవారం రాత్రి నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. మా ఇంట్లో అందరం కలిసి ఫస్ట్ ఎపిసోడ్ చూశామన్నారు. థియేటర్ అయినా, ఓటీటీ అయినా కూడా ఆడియెన్స్ మంచి కాన్సెప్ట్‌లతో వస్తే ఆదరిస్తుంటారు. నేషనల్ వైడ్‌గా అందరినీ ఆకట్టుకునేలా ఈ పరువు వెబ్ సిరీస్ ఉంటుందన్నారు.  ఫస్ట్ ఎపిసోడ్ చూసినంత సేపు టైం తెలియలేదు. అప్పుడే అయిపోయిందా? అనేలా ఉంది. విప్లవ్ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.  ఏ ఒక్కరు కూడా కొత్త యాక్టర్‌గా అనిపించలేదు. నరేష్ అగస్త్య అద్భుతంగా నటించారు. ఆయన విలక్షణ నటుడు. నాన్న నాగబాబును ఈ వెబ్ సిరీస్ లో చూస్తే భయమేస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో మా నాన్న నటన అందరిని ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. నేను మా హనీ అక్క కోసం ఇక్కడికి వచ్చాను. అక్క ఎప్పుడూ మా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుని అవకాశాలు అడగలేదు. సొంతంగా బిల్డ్ చేసుకుంటోంది. మా అక్కని చూస్తే నాకెంతో గర్వంగా ఉందన్నారు. ఈ సిరీస్ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

సుష్మిత కొణిదెల మాట్లాడుతూ..
‘మా ప్రతీ ప్రాజెక్ట్‌కు మీడియా ఎంతో సహకరిస్తూ వస్తోంది. జీ5 టీం మాకు ఎంతో అండగా నిలబడుతోంది. గోల్డ్ బాక్స్, మా పరువు ప్రాజెక్ట్‌కు జీ5 టీం ఎంతో సహకరించింది. ఇది చాలా సున్నితమైన అంశమని కొనియాడారు. . ప్రతీ ఎపిసోడ్‌కు ఇంట్రెస్ట్‌ పెరుగుతూనే ఉంది. పవన్ సాధినేని షో రన్నర్ మాత్రమే కాదు క్రైసిస్ మేనేజర్‌గానూ వ్యవహరించారన్నారు.  ఆయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చేది కాదు. పరువు కోసం ప్రతీ ఒక్క టీం మెంబర్ ప్రాణం పెట్టి పని చేసిన విషయాన్ని గుర్తు చేశారు.సమాజంలో ఇంకా ఈ అంశం గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. పరువు హత్యల వల్ల బాధపడుతున్న వారి గురించి చెప్పాలనే ఉద్దేశంతోనే సిద్దార్థ్, రాజ్ అద్భుతంగా ఈ స్క్రిప్ట్ రాశారు. ఎన్నో లేయర్స్, ఎన్నో కారెక్టర్లతో పరువు స్క్రిప్ట్‌ను అద్భుతంగా రాశారు.

దర్శక, రచయిత సిద్దార్థ్ నాయుడు మాట్లాడుతూ.. ‘పరువు హత్యలు అనేది చాలా సున్నితమైన అంశం. రాయడం ఒకెత్తు అయితే.. ఇలాంటి ప్రాజెక్ట్‌లను నిర్మించడం సాహసమనే చెప్పాలి. సుష్మిత ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చారు. ఆమె ఇచ్చిన సపోర్ట్‌తోనే మా ప్రాజెక్ట్  కార్యరూపం దాల్చింది. .

దర్శక, రచయిత వడ్లపాటి రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మా మొదటి ఎపిసోడ్‌ను అందరూ చూసి అభినందించారు. ఆ ఎపిసోడ్‌లానే సిరీస్ అంతా కూడా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.

బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘పరువు హత్యల మీద చాలా కథలు వచ్చాయి. కానీ ఇంకా ఇంకా రావాలి. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఈ పరువు హత్యల గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. కానీ మనం ఇలాంటి సమాజంలో ఉన్నామా? అని అనుకునేలా ఇలాంటి కథలు ఇంకా రావాలన్నారు.

నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇలాంటి మంచి సబ్జెక్ట్ ఉన్న ప్రాజెక్ట్ ఇచ్చిన గోల్డ్ బాక్స్ సుష్మిత కు ప్రత్యేక ధన్యవాదాలు.  ఇలాంటి ఓ వెబ్ సిరీస్ గా నిర్మించడానికి చాలా గట్స్ కావాలి. అది సుష్మితలో కనిపించింది. మా పరువు వెబ్ సిరీస్ అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

జీ5 వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ దేశ్రాయ్ మాట్లాడుతూ.. ‘సిద్దార్థ్, రాజ్‌లు అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. సుష్మిత  మంచి సపోర్ట్  చేసారు. నరేష్ అగస్త్యతో ఇంకో వెబ్ సిరీస్‌ను కూడా స్టార్ట్ చేశామన్నారు. నరేష్ అద్భుతంగా నటించారు. నివేదా నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు. మేం ఈ వెబ్ సిరీస్ పట్ల ఎంతో హ్యాపీగా ఉన్నాము.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News