Chandini Chowdary NBK109:
షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ ను మొదలుపెట్టిన తెలుగు అమ్మాయి చాందిని చౌదరి. 2018 లో రాజా గౌతమ్ హీరోగా నటించిన మను సినిమాతో చాందిని చౌదరి తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా కూడా పరిచయం అయింది. మొదటి సినిమాతో హిట్ అందుకోలేక పోయినప్పటికీ నటన పరంగా మంచి మార్కులు వేయించుకుంది ఈ భామ.
సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫొటో సినిమాతో మొట్టమొదటి హిట్ అందుకున్న చాందిని తాజాగా ఇప్పుడు యువ హీరో విశ్వక్ సేన్ సరసన గామి అనే సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఈ వారం శుక్రవారం నాడు థియేటర్లలో విడుదల కాబోతోంది. అయితే చాందిని ప్రతిభకు తగిన ఆఫర్లు ఇప్పటివరకు రాలేదనే చెప్పాలి. నేషనల్ అవార్డు విన్ అయిన కలర్ ఫోటోలు తన నటన హైలెట్ గా నిలిచిన .. ఆ తరువాత కూడా అనుకున్న స్థాయిలో ఈ హీరోయిన్ కి ఆఫర్స్ రాలేదు. మంచి అవకాశం వస్తే తప్పకుండా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ ని చాందిని దాటడం ఖాయం.
ఈ నేపథ్యంలో చాందిని చౌదరి కి ఇప్పుడు ఒక సీనియర్ హీరో సినిమాలో అదిరిపోయే పాత్ర లభించింది అని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే 109 అని పిలవబడుతున్న ఈ సినిమా లో ప్రముఖ మలయాళం నటుడు దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో చాందిని చౌదరికి మంచి పాత్ర దొరికినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో శ్రీ లీల పాత్ర వంటి నటనకు స్కోప్ ఉన్నటువంటి పాత్ర ఈ సినిమాలో చాందిని చౌదరి కి దొరికింది అని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా భగవంత్ కేసరిలో మన తెలుగు అమ్మాయి శ్రీలీలా కి పవర్ ఫుల్ రోల్ ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు బాలకృష్ణ. ఇప్పుడు మళ్లీ అలాంటి రోల్ మరో తెలుగు అమ్మాయి చాందినీకి కూడా బాలకృష్ణ సినిమాలో దక్కింది అని తెలియడంతో అభిమానులు తెగ సంబరపడుతున్నారు.
అయితే ప్రస్తుతం తన పాత్ర గురించి ఎటువంటి వార్తలు బయటకు రాకుండా చిత్ర బృందం బాగా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా తీసుకున్నారా అని ఒక విలేకరుల సమావేశంలో ప్రశ్నించినప్పటికీ ఆమె జవాబు ఇవ్వకుండా తప్పించుకుంది. మరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరో సినిమా చాందిని చౌదరి కెరీర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాలి.
మరోవైపు గామి సినిమాలో కూడా ఈమె పాత్ర కి బాగానే స్కోప్ ఉందని సమాచారం. భవిష్యత్తులో కూడా ఈ తెలుగమ్మాయికి మంచి పాత్రలు దొరకాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.
Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!
Read More: Pooja Hegde: పొట్లంకట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు.. ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఫోటోలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook