Manushi Chhillar: బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చిన మానుషి.. సాగరతీరాన సాగరకన్యలా అందాల వల!

Manushi Chhillar: అందాల భామ మానుషి చిల్లర్ బికినీలో మెరిసింది. అందాలు ఆరబోస్తూ ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు కాకరేపుతున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2022, 08:54 AM IST
Manushi Chhillar: బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చిన మానుషి.. సాగరతీరాన సాగరకన్యలా అందాల వల!

Manushi Chhillar: అందాల భామలకు సినీ పరిశ్రమకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందాల పోటీలలో మెరిసిన వారందరూ ఆ తర్వాత కాలంలో బాలీవుడ్ సినిమాల్లో మెరుస్తూ ఉంటారు. అందులో మానుషి చిల్లర్ కూడా ఏమాత్రం మినహాయింపు కాదు. హర్యానాలోని రోహ్తక్ లో జన్మించిన ఆమె తన తల్లిదండ్రుల ఉద్యోగుల రీత్యా చిన్నప్పటినుంచి చాలా ప్రాంతాల్లో పెరుగుతూ వచ్చింది. 
 
ప్రస్తుతం డాక్టర్ చదువుతూనే ఒకపక్క అందాల పోటీలలో పాల్గొంటూ మరోపక్క సినిమాలలో కూడా సత్తా చాటుతోంది. ఫెమినా మిస్ ఇండియా 2017 కిరీటం దక్కించుకున్న ఈ భామ తర్వాత మిస్ వరల్డ్ 2017 టైటిల్ కూడా దక్కించుకుంది. ఇక ఆ తర్వాత మీకు సినీ అవకాశాలు రావడం మొదలయ్యాయి.  
 
అందులో భాగంగానే ఆమె యష్ రాజ్ ఫిలింస్ ప్రాజెక్ట్ లో భాగంగా అక్షయ్ కుమార్ సరసన సామ్రాట్ పృథ్వీరాజ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. చంద్రప్రకాష్ తెరకెక్కించిన ఈ సినిమాలో  ఆమె పాత్రకు మంచి ప్రశంసల దక్కాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె యష్ రాజ్ ఫిలింస్ తో మూడు సినిమాలు సైన్ చేసింది. 
అందులో మొదటి సినిమా పృథ్వీరాజ్ కాగా రెండవ సినిమా ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ. అలాగే జాన్ అబ్రహం సరసన దినేష్ తెరక్కించే తెహరాన్ అనే సినిమాలో కూడా ఆమె భాగమవుతుంది. తాజాగా ఆమె బికినీలో మెరుస్తూ తన ఫోటోలు షేర్ చేసింది. అందులో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.

Also Read: Telugu Movies: ‘లాల్ సింగ్ చద్దా’ మొదలు కార్తికేయ 2 దాకా.. ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాలివే!

Also Read: Neha Shetty: లెహంగాలో రాధిక అందాల విందు.. క్లీవేజ్ సోకులతో వలపు వల!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News