Ponniyin Selvan Collection : పొన్నియన్ సెల్వన్ ప్రభంజనం.. సైలెంట్‌గా కలెక్షన్ల సునామీ

Ponniyin Selvan 1 Collection పొన్నియిన్ సెల్వన్ కలెక్షన్లు చూస్తుంటే అందరికీ కళ్లు బైర్లు కమ్మేట్టుగా ఉన్నాయి. విక్రమ్ లైఫ్ టైం కలెక్షన్లను ఇట్టే లేపి అవతల పారేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 08:58 PM IST
  • కోలీవుడ్ టాప్ గ్రాసర్‌గా మణిరత్నం సినిమా
  • విక్రమ్‌ను బీట్ చేసిన పొన్నియిన్ సెల్వన్
  • ఓవర్సీస్‌లో మణిరత్నం హల్చల్
Ponniyin Selvan Collection : పొన్నియన్ సెల్వన్ ప్రభంజనం.. సైలెంట్‌గా కలెక్షన్ల సునామీ

Ponniyin Selvan 1 Collection : మణిరత్నం సినిమా అంటే అందరికీ ఓ మోస్తరు అంచనాలుంటాయి. కానీ మణిరత్నం మార్క్ చూసి కూడా చాలా కాలమే అయింది. ఆయన తెరకెక్కించిన చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతూ వచ్చాయి. అలా చెలియా, నవాబ్, రావణ్, కడలి ఇలా అన్ని చిత్రాలు దారుణంగా బెడిసి కొట్టేశాయి. ఓకే బంగారం అనే సినిమా ఓకే ఓకే అనిపించింది. అయితే చాలా గ్యాప్ తరువాత మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని పట్టాలెక్కించాడు.

భారీ తారాగణంతో ఈ మూవీని మణిరత్నం కోవిడ్‌లో కష్టపడి తీశాడు. అయితే ముందుగా సౌత్ సినిమాగా తీయాలని భావించాడు. కానీ తెలుగు, కన్నడ, మలయాళం నుంచి క్యాస్టింగ్ సెట్ అవ్వలేదు. దీంతో కార్తీ, విక్రమ్, జయం రవి వంటి వారితో పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తీశాడు. ఇందులో త్రిష, ఐశ్వర్యా రాయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా మణిరత్నం తీర్చాడు.

అయితే ఈ పొన్నియిన్ సెల్వన్ అనేది తమిళుల చరిత్ర. చోళులు, పాండ్యులు అంటూ అక్కడి చరిత్రను చెబుతుంది. దీంతో మిగతా ప్రాంతాల వారికి అంతగా ఎక్కలేదు. మన తెలుగులో అయితే ఈ సినిమా ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయింది. హిందీలోనూ ఈ చిత్రం ఫ్లాపుగా నిలిచింది. అయితే తమిళనాట మాత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అమెరికా, యూకే, రష్యా, సింగపూర్, మలేషియా ఇలా అన్ని దేశాల్లో మాత్రం దుమ్ములేపేస్తోంది.

ఈ చిత్రం ఇప్పటి వరకు తమిళ నాట 185 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 16.5 కోట్లు, కేరళ నుంచి 20 కోట్లు, కర్ణాటక నుంచి 24.2 కోట్లు, రెస్టాప్ ఇండియా నుంచి 22.5 కోట్లు, ఓవర్సీస్ నుంచి 18.5 మిలియన్ డాలర్లు అంటే.. దాదాపు 150 కోట్లు వసూల్ చేసింది. అలా మొత్తంగా ఈ చిత్రం 417.2 కోట్లు కొల్లగొట్టేసింది. అలా సైలెంట్‌గా ఈ చిత్రం విక్రమ్ సినిమా లైఫ్ టైం కలెక్షన్లను లేపి అవతల పారేసింది.

మణిరత్నం దెబ్బకు అందరూ ఫిదా అవుతున్నారు. సినిమాకు మొదట్లో నెగెటివ్ టాక్ వచ్చింది. అయినా కూడా కలెక్షన్లలో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదు. తమిళ నాట ఇది మరిన్ని రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది. అయితే ఇది ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ చాప్టర్ 2 వంటి వాటికి పోటీ వచ్చేలా కనిపిస్తోంది. అయితే తమిళ నాట మాత్రం ఈ సినిమాను టచ్ చేసే చిత్రం దరిదాపుల్లో కనిపించడం లేదు. నేషనల్ వైడ్ కలెక్షన్లలో మాత్రం పొన్నియిన్ సెల్వన్ తక్కువ స్థాయిలో ఉంది.

Also Read : Chandrababu Wife:చంద్రబాబు తన భార్యను ఏమని పిలుస్తారో తెలుసా? బయటపెట్టించిన బాలకృష్ణ

Also Read : Vadinamma Sujitha Dhanush : స్టైలీష్ లుక్కులో వదినమ్మ.. వెకేషన్లో సుజిత.. పిక్స్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News