Manchu Manoj Marriage: మంచు మనోజ్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఆరోజే ఆమెతో ఏడడుగులు!

Manchu Manoj Marriage date: మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన మంచు మనోజ్ కర్నూలు జిల్లాకు చెందిన భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకోబోతున్నాడు, దానికి డేట్ కూడా ఫిక్స్ అయింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 25, 2023, 11:06 AM IST
Manchu Manoj Marriage: మంచు మనోజ్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. ఆరోజే ఆమెతో ఏడడుగులు!

Manchu Manoj to Marry Bhuma Mounika Reddy: మంచు మోహన్ బాబు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్ ఒక బ్లాక్ బస్టర్ హిట్టు కూడా అందుకోలేకపోయాడు. చెప్పుకోదగ్గ సినిమాలు చాలా చేశాడు కానీ కెరియర్లో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోలేదనే బాధ ఆయనకు ఉంది. అయితే మంచు మనోజ్ ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనే ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దాని కంటే ఎక్కువగా పర్సనల్ కారణాలతో మంచు మనోజ్ ఈ మధ్య వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు.

ఆయన కర్నూలు జిల్లాకు చెందిన భూమా కుటుంబానికి చెందిన అమ్మాయిని రెండో వివాహం చేసుకోబోతున్నాడు అనే వార్త పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి మంచు మనోజ్ గతంలోనే ఒక అమ్మాయిని ప్రేమించి పెద్దలు అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎందుకో తెలియదు వారి ఇద్దరికీ విడాకులు అయ్యాయి. విడాకులు అయిన తర్వాత ఒంటరిగానే జీవిస్తూ వస్తున్న మంచు మనోజ్ భూమా కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డారని ప్రచారం ఊపందుకుంది.

దానికి తగ్గట్టుగానే వారిద్దరూ కలిసి పలు సందర్భాలలో కనిపించడంతో వీరు ఇక వివాహం చేసుకుంటారని వార్త పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. అయితే గత కొద్ది రోజులుగా ఈ విషయం మీద ఎలాంటి వార్తలు బయటికి రాలేదు, కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు మార్చి మూడో తేదీన మంచు మనోజ్ మౌనిక రెడ్డి ఇద్దరు వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అటు మంచు మనోజ్ తో పాటు భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ వివాహమే. భూమా కుటుంబానికి మంచు మోహన్ బాబు కుటుంబానికి చాలా రోజుల నుంచి సాన్నిహిత్యం ఉంది.

ఒక కుటుంబం సినిమాల్లో ఉన్నా మరొక కుటుంబం రాజకీయాల్లో ఉండడంతో మంచు మనోజ్ సహా భూమా మౌనిక రెడ్డికి చాలా రోజుల నుంచే పరిచయం ఉందని భూమా మౌనిక రెడ్డి మొదటి వివాహానికి సైతం మంచు మనోజ్ హాజరయ్యారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక ఈ వివాహానికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా మంచు మనోజ్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ వివాహం మంచు మోహన్ బాబుకి ఇష్టం లేదని ఒక పక్క ప్రచారం జరుగుతోంది. మరి వివాహానికి మంచు మోహన్ బాబు హాజరవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Also Read: Actress Divi Photo: ప్యాంట్ వేసుకోవడం మరచి ఫొటో షేర్ చేసిన దివి.. వామ్మో ఇలా ఉందేంటి?

Also Read: Shilpa Shetty Photos: ఎద అందాలన్నీ కనిపించేలా శిల్పా శెట్టి హాట్ ట్రీట్.. దారుణమైన కామెంట్లతో రెచ్చిపోయిన నెటిజన్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News