Manchu Manoj: బేబీబంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక.. ‘పిల్లా ఓ పిల్లా నువ్వే నా ప్రాణం’ అనేసిన మనోజ్..

Bhuma Mounica Baby Bump Photos: మంచు మనోజ్ ,భూమా మౌనిక త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే .ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా మౌనిక తన బేబీబంప్ తో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2024, 12:18 PM IST
Manchu Manoj: బేబీబంప్ ఫోటోలు షేర్ చేసిన మౌనిక.. ‘పిల్లా ఓ పిల్లా నువ్వే నా ప్రాణం’ అనేసిన మనోజ్..

 Bhuma Mounica:
దొంగ దొంగ మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మోహన్ బాబు వారసుడు మంచు మనోజ్. హీరోగా పరిచయం కావడానికి ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా మనోజ్ సినిమాలు చేసి మెప్పించాడు. వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న మనోజ్ ఆ తర్వాత చాలా రోజుల నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చాడు. మొదటి భార్య ప్రణతితో విడాకులు తీసుకున్న తర్వాత కొంత కాలం గ్యాప్ ఇచ్చి భూమా మౌనికను పెళ్లి చేసుకున్నాడు.

ఇరు కుటుంబాలను ఎట్టకేలకు ఒప్పించి ఈ ఇద్దరు ప్రేమికులు 2023లో పెళ్లి పీటలు ఎక్కారు. భూమా మౌనికకు కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. పెళ్లి అయిన తర్వాత గత సంవత్సరం డిసెంబర్ లో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ వార్త విని తమ కుటుంబ సభ్యులంతా ఎంతో సంతోషంగా ఉన్నట్లు కూడా వాళ్ళు తెలియపరిచారు. రీసెంట్ గా భూమా మౌనిక తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ లో మౌనిక దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మనోజ్ తో కలిసి దిగిన ఫోటోలను  షేర్ చేసిన మౌనిక ఓ ఎమోషనల్ క్యాప్షన్ ని కూడా జత చేశింది. నా లో ఉన్న లైఫ్, నా పక్కన ఉన్న లైఫ్ ఎప్పటికప్పుడు నన్ను ఆకర్షిస్తాయి.. మళ్లీ మళ్లీ ప్రేమలో పడేలా చేస్తాయి అంటూ పోస్ట్ చేసిన మౌనిక.. తన మొదటి కొడుకు ధైరవ్, మనోజ్లను ఈ పోస్టుకు ట్యాగ్ చేసింది. దీనికి రెస్పాండ్ అయిన మనోజ్ ఓ పిల్లా.. ఓ పిల్లా..నువ్వంటే నాకు ప్రాణమే అని కామెంట్ చేశాడు. మనోజ్ నటించిన కరెంటు తీగ చిత్రంలోని’ ఓ పిల్లా ఓ పిల్లా’ సాంగ్ గుర్తు తెచ్చే విధంగా ఉన్న అతని పోస్ట్ బాగా వైరల్ అయింది.

 

 
 
 
 
 

ఇక మనోజ్ విషయానికి వస్తే 2017లో వచ్చిన ఒక్క‌డు మిగిలాడు మూవీ తర్వాత ఇక  సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అతను మళ్లీ తిరిగి సినిమాలు చేయడానికి సిద్ధపడ్డాడు. త్వరలో మనోజ్ హీరోగా నటిస్తున్న వాట్ ద ఫిష్ చిత్రం కూడా విడుదల కాబోతోంది.ఇప్పుడు మనోజ్ ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఈ విన్’లో ఉస్తాద్ అనే సెలబ్రిటీ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ టాక్ షోలో మనోజ్ తన పర్ఫామెన్స్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. సెలబ్రిటీలతో కలిసి మనోజ్ చేస్తున్న సందడి చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.

Also Read: Kavitha: నిందితురాలిగా చేర్చిన సీబీఐ.. లిక్కర్‌ స్కామ్‌లో కవిత అరెస్ట్‌ తప్పదా?

Also Read: Rs 500 Gas: మేడారంలో రేవంత్‌ రెడ్డి శుభవార్త.. రూ.500కే గ్యాస్‌, రుణమాఫీ ఎప్పటినుంచంటే?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News