Manchu Manoj on Bhuma Mounika Reddy: పెళ్లి వార్తలపై పెదవి విప్పిన మనోజ్.. మంచి రోజు కోసమే వెయిటింగ్ అంటూ!

Manchu Manoj gave Clarity on Second Marriage with Bhuma Mounika Reddy: భూమా మౌనికతో రెండో వివాహం అని ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆ వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 5, 2022, 07:18 AM IST
Manchu Manoj on Bhuma Mounika Reddy: పెళ్లి వార్తలపై పెదవి విప్పిన మనోజ్.. మంచి రోజు కోసమే వెయిటింగ్ అంటూ!

Manchu Manoj gave Clarity on Second Marriage with Bhuma Mounika Reddy: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. దానికి కారణం ఆయన హైదరాబాద్ సీతాఫల్మండిలోని ఒక గణేష్ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజలలో భూమా మౌనిక రెడ్డితో కలిసి కనిపించడమే. దీంతో వీరిద్దరూ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు అదే గణేష్ మండపం దగ్గరే ప్రశ్నించారు.

మీరు మౌనిక పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి దాని గురించి మీరు ఏమంటారు అని ప్రశ్నించగా అది తన పర్సనల్ విషయం అని సందర్భం వస్తే ఖచ్చితంగా అధికారికంగా చెబుతానని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి అనుకోకపోతే అదేమీ లేదు అని చెబుతారు, అది పర్సనల్ అని సందర్భం వచ్చినప్పుడు చెబుతాను అని మంచు మనోజ్ అన్నానంటే కచ్చితంగా వీరు వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం మొదలైంది. హైదరాబాదుకు చెందిన ప్రణతి రెడ్డిని 2015 వ సంవత్సరంలో మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నారు. తన సోదరుడు మంచు విష్ణు వివాహంలో పరిచయమైన ప్రణతి రెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో పడ్డారు.

ఆ తర్వాత వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నా కలిసి బతకలేమని నిర్ణయించుకుని 2019లో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఆ తర్వాత మంచి మనోజ్ సింగల్ గానే ఉంటున్నారు. దీంతో ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు భూమా మౌనికతో కలిసి కనిపించడంతో వీరిద్దరికీ వివాహం జరగబోతుందని ప్రచారం పెద్ద ఎత్తున మొదలయింది. ఇక సినిమాల విషయానికొస్తే చివరిగా ఒక్కడు మిగిలాడు అనే సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచు మనోజ్ ఆ తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకున్నాడు. విడాకుల ప్రకటన తర్వాత ఆయన అహం బ్రహ్మాస్మి అనే ఒక సినిమా ప్రకటించారు.

పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు కానీ ఆ సినిమా ఎంత దాకా వచ్చింది అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. భూమా మౌనిక రెడ్డి విషయం చూస్తే ఆమె 2016 వ సంవత్సరంలో బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నారు. అయితే సుమారు రెండేళ్ల క్రితం మౌనిక రెడ్డి గణేష్ తో విడిపోయి విడాకులు తీసుకున్నారు. గణేష్ రెడ్డి కుటుంబానిది చిత్తూరు జిల్లా అయితే వ్యాపార రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారని తెలుస్తోంది.

ఇక వీరి విడాకుల తర్వాత మౌనిక రెడ్డి హైదరాబాద్ లో ఉంటున్నారని అంటుండగా కొన్ని నెలల క్రితం మంచు మనోజ్ మౌనిక చెన్నైలో ఈస్ట్ కోస్ట్ రోడ్ లోని ఒక విల్లాలో కలిసి ఉన్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత హైదరాబాద్ మకాం మార్చారని ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఇద్దరూ కలిసే ఉంటున్నారు అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద మంచు మనోజ్ అధికారికంగా ప్రకటిస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరో ఆశక్తికరమైన విషయం ఏమిటంటే మంచు మనోజ్ మంచు మోహన్ బాబు కుటుంబం నుంచి కూడా దూరంగా ఉంటున్నారని మంచు ఫ్యామిలీకి సంబంధించిన మరో ఇంట్లో మంచు మనోజ్ ఉంటున్నారని తెలుస్తోంది.

Also Read: Manchu Manoj - Bhuma Mounika Reddy: పొలిటికల్ లీడర్స్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి?

Also Read: Bigg Boss Telugu 6: హౌస్ లో ఒక్కరొక్కరిగా ఎంట్రీ ఇచ్చిన స్టార్స్.. ఎవరెవరు ఉన్నారంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News