Man Arrested for Bomb Threatening Call: సాధారణంగా విమానాశ్రయానికి గంటా గంటన్నర కంటే ముందే రావాలని చెబుతూ ఉంటారు అధికారులు. అయితే ఒక్కోసారి కొంతమంది ప్రయాణికులు కొన్ని కారణాలతో ఆలస్యంగా వస్తే విమాన సంస్థల నిర్ణయం మేరకు వారిని అనుమతించాలా లేదా అనే విషయం మీద నిర్ణయం తీసుకుంటారు. అయితే ఆలస్యంగా వచ్చిన తనను విమానం ఎక్కించలేదని కోపంతో ఒక ప్రయాణికుడు చేసిన ఫోన్ కాల్ శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది అందరినీ టెన్షన్ పెట్టింది.
అలాగే హైదరాబాదు నుంచి చెన్నై వెళుతున్న ప్రయాణికులు అందరికీ గుండెల్లో గుబులు రేపింది. అసలు విషయం ఏమిటంటే హైదరాబాదులో విమానం ఎక్కేందుకు సిబ్బంది అనుమతి ఇవ్వకపోవడంతో విమానం ఎక్క లేకపోయిన భద్రయ్య అనే వ్యక్తి పోలీసులకు తన ఫోన్ నుంచి ఫోన్ చేసి హైదరాబాదు నుంచి చెన్నై వెళుతున్న విమానంలో బాంబు ఉందని సమాచారం ఇచ్చాడు. దీంతో అప్పటికప్పుడు విమానాన్ని నిలిపివేసిన సిబ్బంది ప్రయాణికులు అందరినీ కిందకి దింపి క్షుణ్ణంగా మరోసారి తనిఖీలు జరిపారు.
ఎలాంటి బాంబు లేదని తెలుసుకుని తర్వాత ఈ ఫోన్ కాల్ చేసింది ఎవరని కాల్ ట్రేస్ చేయడంతో అతని పేరు భద్రయ్య అని విమానంలో ప్రయాణించాల్సిన వ్యక్తి అని తెలిసింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా తాను హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లాల్సి ఉందని విమానాశ్రయానికి ఆలస్యంగా రావడంతో సిబ్బంది తనను విమానం ఎక్కేందుకు అనుమతించలేదని చెప్పాడు. ఆ కోపంతో డయల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి బాంబు ఉందని చెప్పానని చెప్పుకొచ్చాడు.
దీంతో పోలీసులు వెంటనే అతని మీద కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో అరెస్టు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనక క్షణికావేశమే కారణమా లేక మరేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే విషయం మీద దర్యాప్తు చేస్తున్నారు. డీజీసీఏ నిబంధనల ప్రకారం ఇలా ఒక విమానంలో బాంబు ఉందని బెదిరింపు కాల్స్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉంటారు. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కఠినమైన చట్టాలు కూడా శిక్షించేందుకు ఉన్నాయి. మరి భద్రయ్య విషయంలో ఏం జరగబోతుందనేది చూడాల్సి ఉంది.
Also Read: Vinaro Bhagyamu Vishnu Katha: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ..కిరణ్ అబ్బవరం సినిమాకు బంపర్ ఆఫర్!
Also Read: Chiranjeevi Bholaa Shankar: పవన్ ఫ్యాన్ గా చిరు.. ఇదేదో మాములుగా లేదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook