Akhil Agent: అఖిల్ 'ఏజెంట్' మూవీ అప్ డేట్... మమ్ముట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!

Agent Movie: అఖిల్ 'ఏజెంట్' మూవీ నుంటి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2022, 09:06 PM IST
Akhil Agent: అఖిల్ 'ఏజెంట్' మూవీ అప్ డేట్... మమ్ముట్టి ఫస్ట్ లుక్ రిలీజ్!

Mammootty First Look: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) తాజా చిత్రం 'ఏజెంట్'(Agent Movie). సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హిపాప్ సంగీతం అందిస్తున్నాడు. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా సాక్షి వైద్య నటిస్తోంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి (Mammootty) కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. 

పోస్టర్ ను విడుదల చేస్తూ..క్రమశిక్షణ, అంకితభావంతో తనదైన మార్గాన్ని సుగమం చేసుకున్న మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఏజెంట్ సినిమాలో చేరారు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తన లుక్ ను పూర్తిగా మార్చేశాడు అఖిల్. సిక్స్ ప్యాక్ బాడీతో సందడి చేయనున్నాడు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్, ఎడిటర్ నవీన్ నూలి వ్యవహారించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. 

Also Read: Naga Shourya: నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

Trending News