LEO OTT: దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విడుదలైన లియో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఖైదీ, విక్రమ్ సినిమాల తర్వాత విడుదలైన ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
తాజాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా విడుదల కి సిద్ధమవుతోంది. అయితే ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమా వెర్షన్ థియేటర్లలో విడుదలైన వెర్షన్ కి భిన్నంగా ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర డైరెక్టర్ లోకేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఫ్లాష్ బ్యాక్ లోని 18 నుండి 20 నిమిషాల భాగం కేవలం ఫ్యాన్స్ కోసం మాత్రమే చిత్రీకరించింది అని, కానీ ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమా వెర్షన్ దీనికి భిన్నంగా ఉంటుంది అని అన్నారు లోకేష్. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఉన్న హీరోల ఉద్దేశాల గురించి చెబుతూ తన కూతురు ని కాపాడుకోవడం ఢిల్లీ ఉద్దేశం, ఒక డ్రగ్స్ లేని సమాజాన్ని చూడటం విక్రమ్ ఉద్దేశం, అదేవిధంగా లియో చనిపోయాడు అని, ఇప్పుడు కేవలం పార్తిబన్ మాత్రమే ఉన్నాడు అని ప్రపంచం నమ్మేలా చేయడం లియో యొక్క ఉద్దేశం అని అన్నారు.
అంతేకాకుండా క్లైమాక్స్ లో లియో తనకి తాను గా ఆంటోనీ దాస్ కి చెప్పే వెర్షన్ కేవలం ఓటీటీ లో మాత్రమే ఉంటుంది అని అన్నారు. ఈ నేపథ్యంలో సినిమాని ఇప్పుడు ఓటీటీ లో కూడా చూడడానికి అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓటీటీ వెర్షన్ లో చిత్ర బృందం ఎలాంటి మార్పులు చేసింది అని ఫాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు. థియేటర్లో చూపించిన వెర్షన్ లో లియో ఫ్లాష్ ప్యాక్ చాలామందికి నచ్చలేదు. మరి ఓటీటీ వెర్షన్ లో అయినా నచ్చుతుందో లేదో చూడాలి.
నిజానికి వేరే హీరోని దృష్టిలో పెట్టుకొని లియో కథ ని రాశానని కానీ మాస్టర్ లో విజయ్ తో కలిసి పని చేసిన తర్వాత అతని కోసమే కథని మార్చినట్టు చెప్పారు లోకేష్. సంజయ్ దత్, అర్జున్ సర్జ లు ముఖ్య విలన్లు గా కనిపించిన లియో సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మిస్కిన్, మడోన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించారు.
Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook