Mahi V Raghava - Yatra 2: ఫిల్మ్ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది?.. దర్శకుడు మహి వి. రాఘవ సంచల వ్యాఖ్యలు ..

Mahi V Raghava - Yatra 2: మహి వి రాఘవ.. తెలుగులో ఆనందో బ్రహ్మ, యాత్ర, యాత్ర 2 మూవీలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానిక చేసిన పాదయాత్ర నేపథ్యంలో 'యాత్ర 2' మూవీ చేసారు. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు తన పై అనవసరంగా బురద జల్లుతున్నాయంటూ మీడియాతో చిట్ చాట్ చేసారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 13, 2024, 11:36 AM IST
Mahi V Raghava - Yatra 2: ఫిల్మ్ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది?.. దర్శకుడు మహి వి. రాఘవ సంచల వ్యాఖ్యలు ..

Mahi V Raghava - Yatra 2: ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్లు రాయలసీమ నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కించారు. కానీ ఇక్కడ స్టూడియోలు గట్రా నిర్మించాలనే ఆలోచనే వారికి రాలేదంటూ మహి వి రాఘవ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీపై విరుచుకు పడ్డారు. నిజంగానే నాకు.. నా ప్రాంతానికి ఏదో చేయాల‌నే ఆశ లేక‌పోతే.. నేను భాగ్యనగరంలోనో.. విశాఖ పట్నంలోనో స్టూడియో క‌ట్టుకోవటానికి స్థ‌లం కావాల‌ని అడిగే వాణ్ణి. కానీ వెనుక‌బ‌డిన ప్రాంతంగా చూసే మ‌ద‌న‌ప‌ల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటాను అని దర్శక నిర్మాత మహి వి.రాఘవ్ అన్నారు. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన ‘యాత్ర 2’ విడుదలైన మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా చేసిన దానికే మ‌ద‌న‌ప‌ల్లిలోని హ‌ర్సిలీ హిల్స్‌లో ఏపీ ప్ర‌భుత్వం... మ‌హి వి.రాఘ‌వ్‌కి స్టూడియో నిర్మాణం కోసం రెండెక‌రాలు భూమి ఇచ్చిందంటూ ఓ వర్గానికి చెందిన మీడియాలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై మ‌హి.వి.రాఘ‌వ్ స్పందించారు.

నేను దర్శకుడిగా.. నిర్మాతగా.. రచయతగా.. సినీ ఇండస్ట్రీలో 16 యేళ్లుగా ఉంటున్నాను. 2008లో టాలీవుడ్ సినీ పరిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టాను. మూన్ వాట‌ర్ పిక్చర్స్, 3 ఆట‌మ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థ‌ల‌ను స్థాపించాను. నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అంద‌రికీ తెలుసు. విలేజ్‌లో వినాయ‌కుడు, కుదిరితే క‌ప్పు కాఫీ, పాఠ‌శాల‌, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర‌, సిద్ధా లోకం ఎలా ఉంది, యాత్ర 2 సినిమాల‌ను డైరెక్ట్ చేశాను. అలాగే సేవ్ ది టైగ‌ర్స్‌, సైతాన్ అనే వెబ్ సిరీస్‌ల‌ను రూపొందించాను. నేను రాయ‌ల‌సీమ ప్రాంతంలోని మ‌ద‌న‌ప‌ల్లిలోనే పుట్టి పెరిగాను. అక్క‌డే చ‌దివుకున్నాను. సినీ ప‌రిశ్ర‌మ‌లో రాయ‌ల‌సీమ ప్రాంతానికి పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌దు. అంటే అక్క‌డ షూటింగ్స్ చేయ‌టానికి ఎవ‌రూ ఆస‌క్తి చూపించలేదు. అందుకే ఇక్కడు స్టూడియో కట్టాలనుకున్నాను.

నేను తెరకెక్కించిన 'ఆనందో బ్ర‌హ్మ'‌, 'సేవ్ ది టైగ‌ర్స్' అనే వెబ్ సిరీస్‌లను రాయలసీమలో తెరకెక్కించలేదు. పాఠ‌శాల‌, యాత్ర 2, సిద్ధా లోక‌మెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయ‌ల‌సీమ‌లోనే  చిత్రీకరించాను. ముఖ్యంగా ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధాలోకం అనే మూడు ప్రాజెక్ట్స్‌ను మ‌ద‌న‌ప‌ల్లి, క‌డ‌ప ప్రాంతాల్లో షూటింగ్ చేసామన్నారు. మూడు ప్రాజెక్ట్స్‌కి దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేశాను. అందుకు కార‌ణం నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాల‌నే ఉద్దేశమే ఉందే తప్ప మరొకటి లేదు.

అందుకోసమే నేను సంపాదించిన డ‌బ్బుని నేను పుట్టిన రాయలసీమ గడ్డపై  ఖ‌ర్చు పెట్టాను. అక్క‌డ సినిమాలు చేయ‌టం వ‌ల్ల లాడ్జీలు, హోటల్స్‌, భోజ‌నాలు, జూనియ‌ర్స్ ఇలా పలు రకాలుగా స్థానికులు ఉపయోగం ఉంటుందని భావించాను. ఈ జ‌ర్నీలో నేను వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయ‌ల‌సీమ‌లో మినీ స్టూడియో నిర్మించాల‌నుకున్నాను. అందువ‌ల్ల లోక‌ల్ జ‌నాల‌కు ఉప‌యోగంగా ఉంటుందని ఆలోచించాను.

బుద్ధి ఉన్నోడెవ‌డైనా దీన్ని ఆలోచించాలి. నేనేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై,వంద ఎక‌రాలు అడ‌గ‌లేదు. నేను కేవ‌లం రెండు ఎక‌రాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాల‌నుకున్నాను.  దాని వ‌ల్ల అక్క‌డెవ‌రైనా షూటింగ్స్ చేసుకోవాల‌నుకుంటే అంద‌రికీ యూజ్‌గా ఉంటుంది. అందరికీ ప్రాథమిక సదుపాయాలు  అందుబాటులో ఉంటాయి. అందులో త‌ప్పేముంది.. చేయ‌నివారు ఎలాగూ చేయ‌రు. ఇన్నేళ్లు ఇండ‌స్ట్రీ ఉంటుంది క‌దా, రాయ‌ల‌సీమ‌కు ఎవ‌డైనా ఏమైనా చేశారా అంటూ మండిపడ్డారు. ఎవ‌రూ ఏమీ చేయ‌లేదు. మీరు చేయ‌రు... చేసేవాడిని చెయ్య‌నియ్య‌రు. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించ‌లేదు. వాళ్ల‌కి ప్రియ‌మైన ప్ర‌భుత్వం ఎవ‌రెవ‌రికీ భూముల‌ను ఎక్క‌డెక్క‌డిచ్చింది. వాళ్ల‌కు న‌చ్చిన‌వాళ్ల‌కు, ఇష్ట‌మైన వాళ్ల‌కు భూముల‌ను ఇచ్చుకుంది. వీటి గురించి ఎవ‌రూ మాట్లాడ‌రు. నేను నా ప్రాంతంలో కేవ‌లం రెండు ఎకరాల్లో, అక్క‌డి ప్ర‌జల‌కు ఉప‌యోగ‌ప‌డే ఉద్దేశంతో మినీ స్టూడియో క‌ట్టాలని అనుకుంటే మాత్రం రచ్చ రచ్చ చేస్తున్నారన్నారు.

Also Read: KTR Viral Tweet: శభాష్‌ బావ.. అసెంబ్లీలో దుమ్ము దులిపిన హరీశ్ రావుకు కేటీఆర్‌ ప్రశంసలు

Also Read: TN Assembly: తమిళనాడులో 'జనగణమన' రచ్చ.. అసెంబ్లీని బహిష్కరించిన గవర్నర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News