కరోనా వైరస్ ( Corona virus ) అందరికీ కష్టాల్ని తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ ( Lockdown ) కారణంగా మార్చ్ నుంచి అన్ని షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు మూసేశారు. అయినా సరే సూపర్ స్టార్ సూపర్ స్టారే కదా. లాక్‌డౌన్ సమయంలో కూడా అతని సంపాదన ఏ మాత్రం ఆగలేదు. రెండుచేతులా సంపాదిస్తున్నాడు.
తెలుగు సినీ పరిశ్రమ ( Telugu Industry ) లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ కలిగిన నటుడు మహేష్ బాబు ( Mahesh Babu ) . సూపర్ స్టార్ తనయుడిగా మరో సూపర్ స్టార్ గా ఎదిగాడు. కరోనా సంక్షోభం కారణంగా ఎక్కడికక్కడ చిత్రపరిశ్రమ నిలిచిపోయింది. థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్ లకు అనుమతి లేదు. చిత్ర పరిశ్రమ ఎప్పుడు గాడిలో పడుతుందా అని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అందరూ ఎదురుచూస్తున్నారు. మార్చ్ నుంచి అంతా స్తబ్దత నెలకొంది. ఇటువంటి సమయంలో సైతం సూపర్ స్టార్ సంపాదన ఆగడం లేదట. అదెలాగంటారా…
సోషల్ మీడియా వేదికగా మహేష్ బాబు కొన్ని బ్రాండ్ల ప్రమోషన్ లో పడ్డారు. ఓ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ యాప్‌కు కూడా అంబాసిడర్ ( Mahesh babu Ambassador ) గా వ్యవహరిస్తున్నాడు. ఇది చాలదన్నట్టు మరో ఆఫర్ చేతికి వచ్చిందట. అంతేకాదు దిగ్గజ సంస్థ రిలయన్స్ జియోకు ( Reliance Jio ) మహేష్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందమైనట్టు సమాచారం. రిలయన్స్ జియో త్వరలో 5జి నెట్ వర్క్‌ను ప్రవేశపెట్టబోతున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి తెలుగు ప్రాంతానికి మహేష్‌తో ప్రమోట్ చేయించనున్నారు. ఇలా కరోనా సంక్షోభ సమయంలో సైతం సంపాదన నిలిచిపోకుండా అవకాశాల్ని వినియోగించుకుంటూ ట్రెండ్ అవుతున్నాడు మహేశ్. Also read: Powerstar Movie: వర్మపై హీరో నిఖిల్ ఫైర్