మహేష్ బాబు ఫ్యాన్స్.. గెట్ రెడీ !

ముఖ్యమంత్రిగా మహష్ బాబు ప్రమాణస్వీకారం చేస్తున్నట్టుగా వున్న ఓ షాడో ఇమేజ్‌ని సైతం ఈ పోస్టర్‌లో ఆవిష్కరించారు.

Last Updated : Jan 23, 2018, 08:30 PM IST
మహేష్ బాబు ఫ్యాన్స్.. గెట్ రెడీ !

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ హెడ్ సెట్‌తో రెడీగా వుండండి... ఈ మాటలు అంటోంది ఎవరో కాదు! సూపర్ స్టార్ అప్‌కమింగ్ మూవీ 'భరత్ అనే నేను'ని నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ. అవును ఈ మేరకు తాజాగా ట్విటర్ ద్వారా ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేసిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్.. మహేష్ బాబు ఫ్యాన్స్ అతడి 24వ సినిమా అప్‌డేట్స్ కోసం హెడ్ సెట్స్‌తో సిద్ధంగా వుండాల్సిందిగా అందులో పేర్కొంది. జనవరి 26వ తేదీన ఉదయం 7 గంటలకు 'ఫస్ట్ ఓత్' విడుదల చేయనున్నట్టు డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ట్వీట్ స్పష్టం చేస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ సైతం ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ట్వీట్ చేశారు.

 

ఈ ట్వీట్‌లో ఒక సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో జనం హాజరైతే ఎలా వుంటుందో అటువంటి సన్నివేశాన్ని ప్రతిబింభించే విధంగా బ్యాగ్రౌండ్ చూపిస్తున్న ఫొటోపై "శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని.." అనేటటువంటి వాఖ్యాలు కనిపిస్తున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంలోని వాఖ్యాలన్నీ ఈ పోస్టర్‌పై ప్రముఖంగా కనిపించేలా పోస్టర్‌ని డిజైన్ చేశారు. ముఖ్యమంత్రిగా మహష్ బాబు ప్రమాణస్వీకారం చేస్తున్నట్టుగా వున్న ఓ షాడో ఇమేజ్‌ని సైతం ఈ పోస్టర్‌లో ఆవిష్కరించారు.

Trending News