Mahesh Babu: హీరో మహేష్ బాబు జుట్టు విషయాన్ని బట్టబయలు చేసిన మేకప్ మ్యాన్.. ఇంతకీ విగ్గా..ఒరిజినల్ జుట్టా?

 Mahesh Babu Wig: ప్రముఖ హీరో మహేష్ బాబు హెయిర్ గురించి ఆయన మేకప్ మ్యాన్ మాధవరావు కొన్ని నిజాలను బయటపెట్టారు. అయితే గత కొంతకాలంగా మహేష్ బాబు జుట్టుపై వస్తున్న ప్రశ్నలకు క్లారిటీ దొరికింది. ఇంతకీ మహేష్ బాబుది రియల్ జుట్టా లేదా విగ్గా మీరే తెలుసుకోండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2024, 09:18 AM IST
Mahesh Babu: హీరో మహేష్ బాబు జుట్టు విషయాన్ని బట్టబయలు చేసిన మేకప్ మ్యాన్.. ఇంతకీ విగ్గా..ఒరిజినల్ జుట్టా?

Mahesh Babu Wig: ఏ సినీ ప్రేక్షకుడికైనా హీరోలు హీరోయిన్స్ పర్సనల్ విషయాలను తెలుసుకోవడానికి ఎంతగానో ఆసక్తి చూపుతారు. వారు నిత్య జీవితంలో అనుసరిస్తున్న అలవాట్లతో పాటు వినియోగించే కార్లు? రోజు ధరించే బట్టల ఖరీదు? వారు తరచుగా ఎలాంటి వస్తువులను ఉపయోగిస్తారు? అంతేకాకుండా రోజు ధరించే వాచీల ధర వివరాలు.. మొబైల్ ఫోన్ల ఖరీదు ఎంత? వారుంటున్న ఇళ్ల ఖరీదు ఎంత అనే విషయాలను తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా కొంతమంది అయితే వారిది నిజంగా హెయిర్ స్టైలేనా? నిజంగా లేదా నిజమైన వెంట్రుకలేనా? లేక విగ్గు వాడుతున్నారా? అనే అంశాల పైన కూడా ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం చాలామందికి ప్రముఖ హీరో మహేష్ బాబుది ఒరిజినల్ జుట్టా..? లేదా విగ్గులు వాడుతున్నారా? అనే అనుమానం ఉంది. అయితే ఈ అనుమానానికి ప్రముఖ సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ గా పనిచేసిన మాధవరావు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. గతంలో అనారోగ్య సమస్యలతో మరణించిన సూపర్ స్టార్ కృష్ణకు బ్యూటీ మ్యాన్ గా పనిచేసిన ఆయన పలు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో మహేష్ బాబుకు సంబంధించిన జుట్టు విషయం పై యాంకర్ ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది.

ఈ సందర్భంగా హీరో కృష్ణ గతంలో సినిమాలలో నటించే సమయంలో ఒరిజినల్ జుట్టుతో యాక్ట్ చేసేవారా? లేదా విగ్గు తో చేసేవారా? అనే ప్రశ్న అడిగారు. దీనికి ఆయన ఇలా సమాధానం చెప్పుకొని చెప్పుకొని వచ్చారు.. ఇంతకుముందు కృష్ణ ఒరిజినల్ జుట్టుతోనే సినిమాలు చేస్తుంటే వారిని ఆ తర్వాత కొన్ని రోజులకి అది పల్చబడడంతో విగ్గు వినియోగించడం మొదలు పెట్టారని అన్నారు.. ఇదే సమయంలో యాంకర్ మహేష్ బాబు కూడా విగ్గును వినియోగిస్తారట? అనే ప్రశ్న అని అడిగితే.. ఎప్పటినుంచో మహేష్ బాబు కూడా దిగ్గును వినియోగించే వారని ఆయన విగ్గు లేకుండా ఉండేవారు కాదని, ఆయనకు కూడా చాలా పలచమైన జుట్టు ఉండడంతో విగ్గు వినియోగించాల్సి వచ్చిందని అన్నారు..

Read Also: Motorola Edge 40 Neo Vs Vivo T2 Pro 5G: ఈ రెండింటిలో అద్భుతమైన శక్తివంతమైన మొబైల్‌ ఇదే.. ప్రాసెసర్‌ పరంగా బెస్ట్‌ ఇదే!

మొదట మహేష్ బాబు కొన్ని సినిమాల్లో ఒరిజినల్ హెయిర్‌లోనే నటించినప్పటికీ, రాను రాను ఆయన జుట్టు ఊడిపోవడం ప్రారంభించిందని.. అప్పటి నుంచే ఆయన తరచుగా విగ్గు వాడడం మొదలుపెట్టినట్లు సమాచారం. ఇక ప్రతి నెల విగ్గు వాడడం కొంత కష్టం అనిపించడంతో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా చేయించుకున్నారని తెలుస్తోంది. అధునాతన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌తో కూడిన క్యూ6 హెయిర్ ప్యాచ్ టెక్నాలజీ వినియోగించినట్లు తెలుస్తోంది. ఇక అప్పటినుంచి మహేష్ తల మీద జుట్టు వచ్చినట్లు సమాచారం.  ఈ హెయిర్ సర్జికల్ ఫిక్సింగ్ సిస్టం సెటప్ అని తెలుస్తోంది. ఈ హెయిర్ ఫిక్సింగ్ సిస్టం మహేష్ బాబు ఏ కాకుండా బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ తో పాటు అనేక హీరోలు చేయించుకున్నారని సమాచారం.

(గమనిక: ఇది పాత ఇంటర్వ్యూ. రీసెంట్ గా నెట్టింట వైరల్ అవుతోంది.. Zee Telugu News ధృవీకరించలేదు.) 

Read Also: Motorola Edge 40 Neo Vs Vivo T2 Pro 5G: ఈ రెండింటిలో అద్భుతమైన శక్తివంతమైన మొబైల్‌ ఇదే.. ప్రాసెసర్‌ పరంగా బెస్ట్‌ ఇదే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News