SSMB 29 Update: రాజమౌళి మహేష్‌ బాబు సినిమాపై వింత రూమర్లు.. అన్ని పార్టులుగా సినిమా వస్తుందా..?

SSMB29 Plans For 3 Parts: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాలు ఎంత ఆలస్యంగా వస్తుంటాయో అందరికీ తెలిసిందే. ఒక సినిమాను తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ల సమయం తీసుకుంటాడు. అలాంటిది ఒక సినిమాను మూడు పార్టులుగా తెరకెక్కించబోతోన్నాడనే టాక్ ఎక్కువగా వస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 01:19 PM IST
  • నెట్టింట్లో కొత్త రూమర్ సందడి
  • మహేష్‌ బాబుతో రాజమౌళి భారీ ప్లాన్
  • మూడు భాగాలు రాబోతోన్న సినిమా?
SSMB 29 Update: రాజమౌళి మహేష్‌ బాబు సినిమాపై వింత రూమర్లు.. అన్ని పార్టులుగా సినిమా వస్తుందా..?

SSMB29 Plans for 3 Parts: దర్శకధీరుడు రాజమౌళి ఎంత మెల్లిగా సినిమాలను తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కోసమే మినిమమ్ ఏడాది కేటాయిస్తాడు. ఎంతో డీటైలింగ్‌గా సినిమాకు సంబంధించిన పనులను చేపడతాడు. కథా చర్చల్లోనూ రాజమౌళి ఎంతో నిశితంగా లీనం అవుతాడు. అలాంటి రాజమౌళి తీయబోయే తదుపరి చిత్రం మీద అనేక రూమర్లు వస్తున్నాయి. రీసెంట్‌గా రాజమౌళి కొత్త ప్రాజెక్ట్ మీద వస్తోన్న ఈ వార్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

మహేష్‌ బాబు రాజమౌళి కాంబోలో రాబోతోన్న సినిమాను మూడు పార్టులుగా తెరకెక్కించబోతోన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలే రాజమౌళి ఈ సినిమా గురించి చెబుతూ గ్లోబరెట్టాన్ అనే పదాన్ని వాడటం, ఆ పదం ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి రావడం అందరికీ తెలిసిందే. జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఆల్రెడీ హింట్ ఇచ్చాడు రాజమౌళి.

ఇక ఇందులో మహేష్‌ బాబు తరహా సందేశాలు ఉండవని, అలాంటి సందేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని విజయేంద్ర ప్రసాద్ క్లారిటీగా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీని మూడు పార్టులుగా తీస్తారనే రూమర్లు బయటకు రావడంతో సెటైర్లు వేస్తున్నారు. రాజమౌళి ఒక సినిమాను తీయడానికే రెండు మూడేళ్లు పడుతుంటే.. మూడు పార్టులంటే మినిమం పదేళ్లు అవుతుందని, అప్పటి వరకు మనం ఉంటామా? అంటూ మీమ్స్, ట్రోల్స్ వేస్తున్నారు.

Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే

మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీలీల, పూజా హెగ్డేలతో మహేష్‌ బాబు రొమాన్స్ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. అయితే రాజమౌళి సినిమా మాత్రం ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభిస్తాడని అభిమానులు అనుకుంటున్నారు. మరి రాజమౌళి క్యాంప్ నుంచి ఇంకా కథ పూర్తిగా వండలేదని తెలుస్తోంది.

Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News