Sarkaru Vaari Paata Release Date: వేసవిలో రానున్న ‘సర్కారు వారి పాట’.. రిలీజ్‌ డేట్ మారింది

Sarkaru Vaari Paata Release Date changed: 2021లో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా తో రావాలని అనుకున్నాడు కానీ కరోనా కారణంగా మూవీకి అవాంతరాలు ఎదురయ్యాయి. 2022 సంక్రాంతి కి సర్కారు వారి పాట సినిమా విడుదల చేయాలని మూవీ యూనిట్ భావించింది. అందరికంటే ముందుగానే సినిమా విడుదల తేదీపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 06:10 PM IST
  • స‌ర్కారు వారి పాట‌ మూవీ రిలీజ్‌ డేట్‌లో మార్పు
  • 2022 సంక్రాంతి కి సర్కారు వారి పాట సినిమా విడుదల చేయాలని భావించిన మూవీ యూనిట్
  • 2022 ఏప్రిల్‌ లో రిలీజ్‌ కానున్న స‌ర్కారు వారి పాట‌
Sarkaru Vaari Paata Release Date: వేసవిలో రానున్న ‘సర్కారు వారి పాట’.. రిలీజ్‌ డేట్ మారింది

Mahesh Babu And Keerthy Suresh’s Film Sarkaru Vaari Paata Release Date changed, new date announced: మ‌హేష్ బాబు-ప‌ర‌శురాం కాంబినేష‌న్‌లో రూపొందుతున్న మూవీ స‌ర్కారు వారి పాట‌ (Sarkaru Vaari Paata). ఈ మూవీలో విలన్‌గా సముద్రఖని కనిపించనున్నారు. స‌ర్కారు వారి పాట‌ (Sarkaru Vaari Paata) మూవీలో మహేశ్ సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు.

దుబాయ్ లో తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసిన సర్కారు వారి పాట టీమ్, ఆ తరువాత గోవాలో ఓ షెడ్యూల్ ను కూడా పూర్తిచేసింది. ఈ రెండు షెడ్యూల్స్ లోను భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక మహేష్ బాబు (Mahesh Babu) 2020లో సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

Also Read : Diwali Offer: బంపరాఫర్.. కొత్త ఇంటర్నెట్ కనెనక్షన్లపై రూ. 500 డిస్కౌంట్

2021లో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా తో రావాలని అనుకున్నాడు కానీ కరోనా కారణంగా మూవీకి అవాంతరాలు ఎదురయ్యాయి. 2022 సంక్రాంతి కి సర్కారు వారి పాట సినిమా విడుదల చేయాలని మూవీ యూనిట్ భావించింది. అందరికంటే ముందుగానే సినిమా విడుదల తేదీపై ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Cinema) జనవరి 7న రానుంద‌ని ఎప్పుడైతే ప్ర‌క‌టించారో ప్ర‌ణాళిక‌లు పూర్తిగా మారాయి. సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమాను సంక్రాంతి పోటీ నుంచి తప్పించి సమ్మర్ లో విడుదల చేయాలని మూవీ యూనిట్ ఫిక్స్ అయ్యింది. అది కూడా ఏప్రిల్ నెలలోనే ఎలాంటి పోటీ లేని సమయంలో సినిమాను విడుదల చేయాలని భావించింది.

Also Read : Major making video: అడివి శేష్ నటిస్తున్న మేజర్ బయోపిక్ మేకింగ్ వీడియో

దీంతో ఇప్పటివరకూ 2022 సంక్రాంతి బరిలో నిలిచిన స‌ర్కారు వారి పాట‌ (Sarkaru Vaari Paata) మూవీ విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన స‌ర్కారు వారి పాట‌ వాయిదాపడింది. 2022 ఏప్రిల్‌ 1న స‌ర్కారు వారి పాట‌ (Sarkaru Vaari Paata) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్‌ని విడుదల చేసింది.

బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో భారీ అంచనాలు నడుమ ఈ మూవీ రూపొందుతోంది. సరికొత్త లుక్‌లో మహేశ్ (Mahesh) సందడి చేయనున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్ ప్లస్‌ సంస్థలు సంయుక్తంగా స‌ర్కారు వారి పాట‌ (Sarkaru Vaari Paata) మూవీని నిర్మిస్తున్నాయి.

Also Read : Deepavali 2021 Safe Tips: 'దీపావళి' రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జాగ్రత్తలు మరవద్దు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News