Kalki 2898 AD Update: మహాశివరాత్రి నాడు సర్‌ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్.. ప్రభాస్ పాత్ర పేరు రివీల్..

Kalki 2898 AD: ఊహించని విధంగా మహాశివరాత్రికి సర్‌ప్రైజ్ ఇచ్చింది కల్కి టీమ్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన బిగ్ అప్ డేట్ ను ప్రకటించింది. అంతేకాకుండా పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2024, 06:37 PM IST
Kalki 2898 AD Update: మహాశివరాత్రి నాడు సర్‌ప్రైజ్ ఇచ్చిన కల్కి టీమ్.. ప్రభాస్ పాత్ర పేరు రివీల్..

Kalki 2898 AD Big Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నయా మూవీ 'కల్కి 2898 ఏడీ'. మహా శివరాత్రి (మార్చి 8) సందర్భంగా ఆడియెన్స్ కు సర్‌ప్రైజ్ ఇచ్చింది కల్కి టీమ్. తాజాగా ఈ మూవీలో ప్రభాస్ పాత్ర పేరును రివీల్ చేశారు. ఇందులో ప్రభాస్ 'భైరవ' అనే పాత్రలో కనిపించబోతున్నట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ పేర్కొంది. ఈ మేరకు పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. ఈ పిక్ లో ప్రభాస్ కాస్టూమ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. 

మూవీని సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొనె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగాణం నటిస్తోంది. ఈ మూవీ మే 9న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. విడుదలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో మేకర్స్ షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఈ సినిమాపై భారీ లెవల్లో అంచనాలు పెంచేశాయి.

రీసెంట్ గా కల్కి చిత్ర యూనిట్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ వారంతా దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటలో ప్రభాస్, దిశా పటానీ మధ్య రొమాన్స్ ఉండబోతుందని టాక్ నడుస్తోంది. ఈ సాంగ్ కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్లు దిశా పటానీ ఇటీవల షేర్ చేసిన ఫోటో చూస్తే అర్థమవుతోంది. మరోవైపు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, మారుతితో రాజా సాబ్ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Prabhas (@actorprabhas)

Also Read: Kannappa: కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల.. అదిరిపోయే గెటప్ లో అలరించిన విష్ణు

Also Read: Women's Day Special: పికాసో చిత్రమా.. ఎల్లోరా శిల్పమా.. సారా టెండూల్కర్ అందమా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News