Maha Shivratri 2023: మహా శివరాత్రి స్పెషల్.. తెలుగులో శివుడిగా మెప్పించిన హీరోలు ఎవరో తెలుసా?

Telugu Movies on Lord Shiva: తెలుగులో వచ్చినన్ని పౌరాణిక చిత్రాలు మరేతర ఇండస్ట్రీలో వచ్చి ఉండవు. సీనియర్ ఎన్టీఆర్ వేసినన్ని పౌరాణిక పాత్రలు ఇంకేతర నటుడు తన సినీ కెరీర్లో వేసి ఉండరేమో. రాముడిగా, కృష్ణుడిగా, శివుడిగా ఇలా అన్ని రకాల పాత్రలు పోషించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 09:00 AM IST
  • మహా శివరాత్రి 2023 స్పెషల్
  • తెలుగులో శివుడి మీద సినిమాలివే
  • శివుడిగా మెప్పించిన హీరోలు వీళ్లే
Maha Shivratri 2023: మహా శివరాత్రి స్పెషల్.. తెలుగులో శివుడిగా మెప్పించిన హీరోలు ఎవరో తెలుసా?

Telugu Movies on Lord Shiva: మహా శివుడి మీద తెలుగులో లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు ఇలా చాలా మంది హీరోలు శివుడిగా మెప్పించారు. ఇప్పటి తరానికి అయితే శివుడిగా అంటే చిరంజీవి గుర్తుకు వస్తాడని చెప్పొచ్చు. శ్రీమంజునాథ సినిమాతో శివుడిగా చిరంజీవి అదరగొట్టేశాడు. రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోదనుడు ఇలా ఏ పాత్రలోనైనా మెప్పించే స్వర్గీయ ఎన్టీఆర్ శివుడిగా మెప్పించాడు.

దక్షయజ్ఞం, భూకైలాస్ ఇలా ఎన్నో సినిమాల్లో శివుడిగా ఎన్టీఆర్ మెప్పించాడు. ఇక ఏఎన్నార్ సైతం రెండు షాట్స్‌లో శివుడిగా కనిపిస్తారు. కానీ ఏఎన్నార్ ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో శివుడి పాత్రలో నటించలేదు. శోభన్ బాబు సైతం శివుడిగా కనిపించాడు. 

శివుడిగా కనిపించిన వారిలో కృష్ణంరాజు కూడా ముఖ్యులే. వినాయకవిజయం సినిమాలో శివుడిగా ఆయన అందరినీ ఆకట్టుకున్నారు. ఇక చిరంజీవి నటించిన శ్రీమంజునాథ సినిమా అయితే కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోయినా మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ట్రీట్‌లా అనిపిస్తుంది. శివుడిగా చిరంజీవి సరిగ్గా సరిపోయాడంటూ మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతుంటారు.

ఇక శివుడిగా ప్రకాష్‌ రాజ్ కూడా నటించాడు.కానీ అది ఓ రెండు షాట్స్‌లోనే కనిపిస్తుంది. నాగార్జున అనుష్క నటించిన ఢమరుకం సినిమాలో శివుడిగా ప్రకాష్‌ రాజ్ నటించాడు. శివుడిగా గెటప్‌లో ప్రకాష్‌ రాజ్ ఓ చోట కనిపిస్తాడు. ఇలా తెలుగులో శివుడి మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. శివుడి మీద ఎన్నో సీరియల్స్‌ బుల్లితెరపై వస్తూనే ఉన్నాయి.

మహా శివరాత్రి అంటే తెలుగు వారు మాత్రం కచ్చితంగా భక్త కన్నప్ప సినిమాను చూస్తారు. ఈ సినిమాను కృష్ణంరాజు, మోహన్ బాబు వంటి వారు మళ్లీ నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా భారీ ఎత్తున తీయాలని ప్రయత్నించారు. కానీ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.

Also Read:  Aditya Roy Kapoor Lady Fan : మీద మీదకు వచ్చి ముద్దు పెట్టబోయిన ఆంటీ.. స్టార్ హీరో పరిస్థితి ఎలా అయిందంటే?

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News