Macherla Niyojakavargam: కార్తికేయ 2 దెబ్బకు భారీగా పడిపోయిన మాచర్ల వసూళ్లు… ఎన్ని కోట్లు డ్రాప్ అంటే?

Macherla Niyojakavargam 2nd Day Collections Hugely Dropped: కార్తికేయ 2 దెబ్బకు భారీగా మాచర్ల నియోజకవర్గం వసూళ్లు పడిపోయాయి. నిఖిల్ సినిమా ఎంట్రీతో కోట్లలో డ్రాప్ కనిపించింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 14, 2022, 12:09 PM IST
Macherla Niyojakavargam: కార్తికేయ 2 దెబ్బకు భారీగా పడిపోయిన మాచర్ల వసూళ్లు… ఎన్ని కోట్లు డ్రాప్ అంటే?

Macherla Niyojakavargam 2nd Day Collections Hugely Dropped: అనుకున్నదే అయింది కార్తికేయ 2 దెబ్బకు మాచర్ల నియోజకవర్గం వసూళ్ళలో భారీ కోత పడింది. నితిన్ హీరోగా రూపొందిన మాచర్ల నియోజకవర్గం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజు టాక్ తో సంబంధం లేకుండా కాస్త చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా రెండో రోజు కార్తికేయ 2 సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో కలెక్షన్స్ భారీగా కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది.

మాచర్ల నియోజకవర్గం సినిమా కోటి రూపాయల 80 లక్షల వరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంచనాలు వేశారు. కానీ అనూహ్యంగా కోటి రూపాయల 40 లక్షల మాత్రమే వసూలు చేసి రెండు రోజులకు గాను ఆరు కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ వసూళ్లు సాధించగలిగింది. మాచర్ల నియోజకవర్గం రెండో రోజు ప్రాంతాల వారీగా కలెక్షన్లు కనుక పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో 58 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 21 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 17 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 12 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఆరు లక్షలు, గుంటూరు జిల్లాలో 9 లక్షలు, కృష్ణాజిల్లాలో 10 లక్షలు, నెల్లూరు జిల్లాలో ఏడు లక్షలు మొత్తం కలిపి కోటి రూపాయల 40 లక్షల రూపాయలు షేర్ వసూళ్లు సాధించింది.

ఇక కర్ణాటక సహా మిగతా భారతదేశంలో రెండు రోజులకు కలిపి కేవలం 35 లక్షలు, ఓవర్సీస్లో కేవలం 32 లక్షలు వసూళ్లు సాధించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 6 కోట్ల 69 లక్షల వసూళ్లు సాధించినట్లయింది. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 21 కోట్ల 20 లక్షల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోవడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లుగా నిర్ణయించారు. ఇక ఈ సినిమా 15 కోట్ల 31 లక్షల వసూళ్లు సాధిస్తేనే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.

ఇక ఈ సినిమాతో ఎడిటర్ గా వ్యవహరిస్తున్న రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా మారారు. ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్, శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ల మీద రాజకుమార్ ఆకెళ్ళ, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు ఈ సినిమాలో కృతి శెట్టి, కేథరిన్ థెరిసాలు హీరోయిన్లుగా నటించారు. ఇక సినిమాలో రెండు పాత్రలలో సముద్రఖని నెగిటివ్ షేడ్స్ లో నటించి ఆకట్టుకున్నారు.

Also Read: NBK 107: అన్ని సినిమాలు ఉన్నా సంక్రాంతి బరిలో బాలయ్య.. టైటిల్ అదేనా?

Also Read: Mahesh Babu: కొత్త లుక్ లో మెరిసిపోతున్న మహేష్ బాబు.. ఫోటో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News