FIR against Aamir Khan: అమీర్ ఖాన్‌పై లోని ఎమ్మెల్యే ఫిర్యాదు

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరున్న అమీర్‌ఖాన్‌పై ( Aamir Khan ) ఉత్తర్ ప్రదేశ్‌లోని లోని ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ ( Loni MLA Nand Kishore Gurjar ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్‌ కోసం ఘజియాబాద్ జిల్లాలోని ట్రోనికా సిటీకి వచ్చిన నటుడు అమీర్‌ఖాన్‌.. మాస్క్ ( Face mask ) ధరించకుండా, సోషల్ డిస్టన్సింగ్ పాటించకుండా ఎపిడెమిక్‌ చట్టాన్ని ( Epidemic act ) ఉల్లంఘించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Last Updated : Oct 30, 2020, 02:59 AM IST
FIR against Aamir Khan: అమీర్ ఖాన్‌పై లోని ఎమ్మెల్యే ఫిర్యాదు

ఘజియాబాద్‌ : బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్‌గా పేరున్న అమీర్‌ఖాన్‌పై ( Aamir Khan ) ఉత్తర్ ప్రదేశ్‌లోని లోని ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ ( Loni MLA Nand Kishore Gurjar ) పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా షూటింగ్‌ కోసం ఘజియాబాద్ జిల్లాలోని ట్రోనికా సిటీకి వచ్చిన నటుడు అమీర్‌ఖాన్‌.. మాస్క్ ( Face mask ) ధరించకుండా, సోషల్ డిస్టన్సింగ్ పాటించకుండా ఎపిడెమిక్‌ చట్టాన్ని ( Epidemic act ) ఉల్లంఘించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖానికి మాస్క్‌ ధరించకుండా జనం మధ్య తిరుగుతూ అభిమానులతో ఫొటోలు దిగారనే విషయాన్ని లోని ఎమ్మెల్యే నంద కిషోర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. Also read : Punarnavi Engaged To Udbhav Raghunandan: పునర్నవికి కాబోయే భర్త ఇతడే.. ఫొటో షేర్ చేసిన బిగ్‌బాస్ బ్యూటీ

అమీర్ ఖాన్ తన అప్‌కమింగ్ సినిమా షూటింగ్ కోసం బుధవారం ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీకి ( Tronica City in Ghaziabad ) వచ్చినప్పుడు కొవిడ్‌-19 ప్రోటోకాల్‌ను ( COVID-19 protocol ) ఉల్లంఘించారని.. ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా నందకిషోర్ డిమాండ్ చేశారు. 

ఆగస్టు నెలలో లాల్ సింగ్ చద్దా ( Lal Singh Chaddha ) సినిమా షూటింగ్‌ కోసం టర్కీ వెళ్లిన అమీర్ ఖాన్ అక్కడ టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్డోగాన్‌ను కలవడం వివాదస్పదమైంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ హ్యాంక్స్ ( Tom Hanks ) నటించిన ఫారెస్ట్ గంప్ ( Forrest Gump ) చిత్రానికి హిందీ రీమేక్‌గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా మూవీని అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నారు. Also read : Punarnavi Bhupalam Engagement: సీక్రెట్‌గా పునర్నవి భూపాలం ఎంగేజ్‌మెంట్..! నటి పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News