LOBO: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లకు ఆకలి కష్టాలు..తట్టుకోలేక లోబో ఏం చేశాడంటే..

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ రోజురోజుకూ ఆసక్తిని పెంచుతోంది. టాస్క్ లు కోసం హౌస్ మేట్స్ పడుతున్న కష్టాలు మూమూలుగా లేవు. తాజాగా రిలీజైన ప్రోమోలో కంటెస్టెంట్లకు ఆకలి కష్టాలు ఏంటో తెలియజేశాడు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 29, 2021, 08:53 PM IST
  • బిగ్ బాస్5 లేటేస్ట్ ప్రోమో రిలీజ్
  • ఆకలితో అలమటిస్తున్న కంటెస్టెంట్లు
  • పుడ్ కోసం చెత్తబుట్టలో వెతుకుతున్న లోబో
LOBO: బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లకు ఆకలి కష్టాలు..తట్టుకోలేక లోబో ఏం చేశాడంటే..

Bigg Boss 5 Telugu latest promo: బిగ్ బాస్ రోజు రోజుకు ఆసక్తిగా సాగుతోంది. గత సీజన్స్ కంటే ఈ సీజన్‌లో ఫన్ రెట్టింపు కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ప్రోమో(Bigg Boss Telugu 5 latest promo)లో కంటెస్టెంట్లకు ఆకలి విలువేంటో నేర్పుతున్నాడు బిగ్ బాస్. కెప్టెన్సీ కంటెండర్‌ టాస్క్‌ కోసం హౌస్‌మేట్స్‌ను జంటలుగా విడిపోమన్న బిగ్‌బాస్‌(Bigg Boss) వారిని బరువు తగ్గమని ఆదేశించాడు. ఇందుకోసం వారికి తిండి పెట్టకుండా సతాయిస్తున్నాడు. కేవలం ప్రోటీన్స్‌ షేక్‌, కొబ్బరి బోండాం నీళ్లు మాత్రమే అందిస్తున్నాడు.

కంటెస్టెంట్లు..ఓవైపు ఆకలి(Hunger)తో అలమటిస్తూనే మరోవైపు ఎలాగైనా టాస్క్‌లో గెలవాల్సిందేనని కసితో రగిలిపోతున్నారు. కానీ ఆకలిని తట్టుకోలేక లోబో(lobo) తన కడుపు మాడ్చుకోలేక చెత్తబుట్టలో ఫుడ్‌ కోసం వెతికాడు. ఇది చూసి అక్కడున్న రవి షాకయ్యాడు. బుల్లితెర ప్రేక్షకులు సైతం లోబో పరిస్థితిని చూసి జాలిపడుతున్నారు.

Also Read: Anchor Vishnu Priya: బిగ్ బాస్ హౌజ్‌లోకి యాంక్ విష్ణు ప్రియ Wild card entry ?

కాగా ఈ టాస్క్‌(Task) ప్రారంభమవడానికి ముందు ఇంట్లోని ఆహారం మొత్తాన్ని పంపించేయమని ఆదేశించాడు బిగ్‌బాస్‌. ఆ సమయంలో లోబో తన యాపిల్‌ను దాచుకుని దాచుకుని తిన్నాడు. దీంతో బిగ్‌బాస్‌ తన ఆదేశాలను బేఖాతరు చేశారంటూ కెప్టెన్‌ జెస్సీకి శిక్ష విధించాడు. జెస్సీ(jessy)తో పాటు అతని జోడీ  కాజల్‌ కూడా కెప్టెన్సీకి పోటీపడే అర్హత కోల్పోయారని ప్రకటించాడు. ఈ నిర్ణయంతో జెస్సీ, కాజల్‌ షాక్‌లోకి వెళ్లిపోయారు. హౌస్‌మేట్స్‌ను టెంప్ట్‌ చేసేందుకు బిగ్‌బాస్‌ ఫుడ్‌ పంపించగా ప్రియాంక సింగ్‌ తన నోటిని కట్టేసుకోలేక అందరికీ చూస్తుండగా ఆ వంటకాన్ని అరగించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News