Leo Trailer : 'లియో' ట్రైలర్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Leo Movie: దళపతి విజయ్-లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తున్న సినిమా లియో. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా అక్టోబరు 19న రిలీజ్ కానుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 2, 2023, 07:14 PM IST
Leo Trailer : 'లియో' ట్రైలర్‌ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

Leo Movie Trailer Update: తమిళ్ స్టార్‌ హీరో దళపతి విజయ్ (Vijay) నయా మూవీ లియో (Leo). యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టైటిల్‌ ప్రోమో గ్లింప్స్ వీడియో మూవీపై ఓ రేంజ్ లో అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

తాజాగా ఈ సినిమా ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. అక్టోబరు 05న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా షురూ చేయనుంది లోకేశ్‌ కనగరాజ్ టీం. మరీ ముఖ్యంగా తెలుగులో భారీ ఎత్తున ప్రమోషన్స్ జరపాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందట. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ హక్కులను సితార సంస్థ ఏకంగా 21 కోట్లకు కొనుగోలు చేసిందట. 

లియోలో యాక్షన్‌ కింగ్ అర్జున్ హెరాల్డ్‌ దాస్‌గా, సంజయ్‌ దత్‌ ఆంటోనీ దాస్‌గా నటిస్తున్నారు. వీరిద్దరికి సంబంధించిన గ్లింప్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఈ మూవీలో  ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియోపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు  అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. 

రీసెంట్ గా 'లియో' రిలీజ్ కు ముందే రివ్యూ చెప్పేశాడు డైరెక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ మీనన్. 'లియో’ మైండ్‌ బ్లోయింగ్ మూవీ. నా డబ్బింగ్‌ సమయంలో ‘లియో’లోని కొన్ని సీన్స్‌ చూశా. సినిమా సూపర్‌గా వచ్చింది. విజయ్‌తో వర్క్‌ చేయడం మంచి అనుభూతి' అంటూ గౌతమ్ మీనన్ ఓ ఈవెంట్‌లో వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. మాస్టర్‌ తర్వాత విజయ్‌-లోకేశ్‌ కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో లియోపై వీర లెవల్లో అంచనాలు ఉన్నాయి. 

Also Read: Martin Luther King Teaser: ఇంట్రెస్టింగ్ గా సంపూర్ణేశ్ బాబు‘'మార్టిన్ లూథర్ కింగ్'’ టీజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News