కొరటాల శివ చేతుల మీదుగా ‘ఓ పిట్టకథ’ పోస్టర్ విడుదల

O Pitta Katha అనే చిన్న మూవీని భవ్య క్రియేషన్స్ నిర్మిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో మూవీ సరదాగా సాగిపోతూ ప్రేక్షకులను నవ్వించనుంది.

Last Updated : Feb 5, 2020, 02:53 PM IST
కొరటాల శివ చేతుల మీదుగా ‘ఓ పిట్టకథ’ పోస్టర్ విడుదల

‘పైసా వ‌సూల్‌’, ‘శౌర్యం2, ‘లౌక్యం’,‘సౌఖ్యం’ లాంటి కమర్షియల్ సినిమాలు చేసిన భవ్య క్రియేషన్స్ ఈ సారి ఓ పిట్టకథతో మనముందుకు వస్తోంది.  చందు ముద్దు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఆనంద ప్రసాద్ నిర్మిస్తున్నారు. నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు.

Also Read: నాకు ఆ పిట్టకథ తెలుసు: త్రివిక్రమ్ శ్రీనివాస్

తాజాగా డైరెక్టర్ కొరటాల శివ ‘ఓ పిట్టకథ’కు తన వంతు సాయం చేశారు. ఈ సినిమాలోని పాత్ర‌ల‌కి సంబంధించిన పోస్ట‌ర్‌ని కొర‌టాల శివ బుధవారం ఆవిష్క‌రించారు. ఫిబ్ర‌వ‌రి 7న ఓ పిట్టకథ టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నట్లు యూనిట్ తెలిపింది. పల్లెటూరి నేపథ్యంగా వస్తోన్న ఈ సినిమాలో కేరింత ఫేమ్ విశ్వంత్, నిత్యాశెట్టి, బ్రహ్మాజీ, సంజయ్‌రావు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. 

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News