Sunil Villian Roles: పుష్ప దెబ్బకు సునీల్ వెంటపడుతున్న తమిళ తంబీలు.. కానీ?

Kollywood running after Sunil: పుష్ప సినిమాలో మంగళం శ్రీను అనే క్యారెక్టర్ తో ఆకట్టుకున్న సునీల్ వెంట ఇప్పుడు టాలీవుడ్ పడుతున్న వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 22, 2023, 11:46 AM IST
Sunil Villian Roles: పుష్ప దెబ్బకు సునీల్ వెంటపడుతున్న తమిళ తంబీలు.. కానీ?

Kollywood running after Sunil to Play Villian Roles: లైఫ్ ఎప్పుడు ఎవరికి ఎలాంటి అవకాశం ఇస్తుందో ఎవరూ చెప్పలేరు, ఆ అవకాశం వచ్చినపుడు సద్వినియోగం చేసుకుంటే అంతకన్నా తెలివైనవాడు ఉండడు. ఎందుకంటే ఒకప్పుడు కమెడియన్ గా సినిమాల్లో రాణించిన సునీల్ తర్వాత హీరోగా మారాడు. హీరోగా మారి కొన్ని సినిమాల హిట్లు కూడా అందుకున్న తర్వాత వరుస డిజాస్టర్లు ఎదురవుతూ రావడంతో పూర్తిగా సినిమాలకే దూరమైపోయిన పరిస్థితి.

ఏడాదికి ఒకటో రెండో సినిమాలు చొప్పున నటిస్తూనే ఉన్నా ఆయనకు 2021లో వచ్చిన పుష్ప సినిమా మాత్రం రెండో సారి మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పాలి. అప్పటివరకు కమెడియన్ గా, హీరోగా, కామెడీ పాత్రలలోనే ఎక్కువగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన సునీల్ పుష్ప మొదటి భాగంలో మంగళం శ్రీను అనే పాత్రతో భయపెట్టే ప్రయత్నించేసి దాదాపుగా సఫలమయ్యాడు. ఆ తరువాత కూడా ఎఫ్ త్రీ, చోర్ బజార్, థాంక్యూ, గాడ్ ఫాదర్, తీస్ మార్ ఖాన్, వాంటెడ్ పండుగాడు, సీతారామం, జిన్నా, ముఖచిత్రం, ఊర్వశివో రాక్షసివో లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపిస్తూనే ఉన్నా ఆయనలో ఉన్న విలనిజాన్ని గుర్తించిన తమిళ చిత్ర సీమ మాత్రం ఆయనకు వరుస అవకాశాలు కల్పిస్తోంది.

ఇప్పటికే ఆయన రజనీకాంత్ జైలర్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది. ఇక ఆయన మరో మూడు సినిమాలలో కూడా విలన్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న మావీరన్ అనే సినిమాలో, కార్తీ హీరోగా నటిస్తున్న జపాన్ సినిమాలో అలాగే విశాల్ హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోనీ వంటి సినిమాల్లో కూడా ఆయన విలన్ గా నటిస్తున్నారు. తాజాగా విశాల్ హీరోగా నటిస్తున్న మార్క్ ఆంటోనీ సినిమాలో సునీల్ నటిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫస్ట్ లుక్ లో కూడా సునీల్ మంగళం శ్రీను గెటప్ లో ఉన్నట్లుగానే అనిపిస్తున్నాడు.

ఇటీవల రజనీకాంత్ జైలర్ సినిమా ఫస్ట్ లుక్ లో కూడా సునీల్ లుక్ చూసిన వెంటనే మంగళం శ్రీను గుర్తుకు వచ్చేశాడు. ఇప్పుడు కూడా మార్క్ ఆంటోనీ సినిమాలో సునీల్ లుక్ చూస్తుంటే మంగళం శ్రీను గుర్తుకు రాక మానడు. మొత్తం మీద మంగళం శ్రీను క్యారెక్టర్ సునీల్ జీవితానికి మరొక బూస్టింగ్ పాయింట్ గా మారిందని చెప్పక తప్పదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే రెండు మూడు బాలీవుడ్ సినిమాల్లో అలాగే కొన్ని కన్నడ సినిమాల్లో సైతం సునీల్ ని విలన్ పాత్ర కోసం అడుగుతున్నారు. అది కూడా పుష్ప మంగళం శ్రీను గెటప్ లోనే ఉండాలని అడుగుతున్నారని తెలుస్తోంది. అయితే అన్ని పాత్రలతో సునీల్ మెప్పిస్తాడా లేక అన్ని సినిమాలతో బోర్ కొట్టిస్తాడా అనేది కాలమే నిర్ణయించాలి.

Also Read: SSMB 28: వాల్తేరు వీరయ్య ఎఫెక్ట్.. వింటేజ్ మహేష్ మీద కన్నేసిన త్రివిక్రమ్!

Also Read: Prabhas Movies : ఆరు నెలల్లో మూడు ప్రభాస్ సినిమాలు.. ఇక ఫాన్స్ కి పండగే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News