Kiran abbavaram: ఎట్టకేలకి రిలీజ్ కు ముందే లాభాల్లోకి గీతా ఆర్ట్స్ 2!

Vinaro Bhaygyamu Vishnu katha into profits: ఫిబ్రవరి నెలలో రిలీజ్ అవుతున్న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకి మంచి బజ్ ఉందని, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయిందని చెబుతున్నారు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 5, 2023, 09:20 AM IST
Kiran abbavaram: ఎట్టకేలకి రిలీజ్ కు ముందే లాభాల్లోకి గీతా ఆర్ట్స్ 2!

Vinaro Bhaygyamu Vishnu katha into profits even before release: అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కిరణ్ అబ్బవరం ప్రస్తుతానికి గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో వినరో భాగ్యము విష్ణు కథ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన టీజర్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకోగా ఇటీవల విడుదల చేసిన దర్శన అనే సాంగ్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా సాగింది.

బ్రేకప్ తర్వాత అందరూ విని ఆదరించేలా ఈ సాంగ్ ఉందని కూడా ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఆర్ కళ్యాణమండపం అని హిట్ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు ఆదరించలేదు. అయితే ఈ సినిమా కిరణ్ అబ్బవరం నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అవన్నీ ఉండేలా ఉందని భావిస్తున్నారు. ఒకరకంగా చూసుకుంటే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు అదే ఇప్పుడు గీత ఆర్ట్స్ 2 బ్యానర్ కి బాగా కలిసి వచ్చిందని అంటున్నారు.

ఫిబ్రవరి నెలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి మిగతా అన్ని సినిమాల కంటే మంచి బజ్ ఉందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా విడుదలకు ముందే ప్రాఫిట్ జోన్ లోకి వెళ్ళిపోయిందని చెబుతున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో కాశ్మీర హీరోయిన్ గా నటించింది, మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు.

బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ అందుకుంటామని గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ భావిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ సినిమాలు ఎక్కువగా బోల్తా పడుతూ వస్తున్నాయి. అయితే ఈ సినిమా మాత్రం విడుదలకు ముందే లాభాలు అందుకోవడంతో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మంచి జోష్ మీద ఉంది.
Also Read; RC vs PK: మా వాడే ఒరిజినల్ గాంగ్ స్టర్ అని కొట్టుకుంటున్న చరణ్, పవన్ ఫాన్స్!

Also Read: Prabhas Fans Demand: మాకు అప్డేట్స్ కావాలి సార్.. ట్విట్టర్ ను కదిపేస్తున్న ప్రభాస్ ఫాన్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 
 

Trending News