Tiger3: సల్మాన్ ఖాన్ సినిమాలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్.. భర్త విక్కీ కౌశల్ షాకింగ్ కామెంట్స్

Katraina Kaif: ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకి తన హిందీ సినిమా టైగర్ 3 తో వచ్చింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ తన మాజీ లవర్ సల్మాన్ ఖాన్ తో యాక్ట్ చేయడం విశేషం. కాగా ఈ సినిమాలో ఎంతో హైలెట్ అయిన తగల సీన్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఆమె భర్త విక్కీ కౌశల్.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2023, 09:25 AM IST
Tiger3: సల్మాన్ ఖాన్ సినిమాలో కత్రినా కైఫ్ టవల్ ఫైట్.. భర్త విక్కీ కౌశల్ షాకింగ్ కామెంట్స్

Vicky Kaushal: మల్లీశ్వరి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రిన్సెస్ గా మిగిలిపోయిన హీరోయిన్ కత్రినా కైఫ్. ఆ తరువాత బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు అనే చిత్రంలో నటించినా ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఈ నేపథ్యంలో ఆమె బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

హిందీలో వరస ఆఫర్లు తెచ్చుకుంటూ…ఐశ్వర్యారాయ్ దీపికా పడుకొనే లాంటి హీరోయిన్లకి కొన్ని రోజులపాటు పోటీగా నిలిచింది. కాదా కొద్ది రోజులు సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్న కత్రినా కైఫ్ ఆ తరువాత కొన్ని తెలియని కారణాలవల్ల ఆయనతో విడిపోయింది. ఇక ఈ మధ్యనే బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి కూడా చేసుకుంది కత్రినా.. అయితే సల్మాన్ ఖాన్ తో కత్రినా కైఫ్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా టైగర్ కి ఈమధ్య మూడో పార్ట్ వచ్చింది. ఆ సినిమానే హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన టైగర్ 3.

ఈ చిత్రంలో కత్రినా కైఫ్ తన మాజీ లవర్ సల్మాన్ ఖాన్ తో కలిసి నటించింది. కాదా ఈ సినిమా ట్రైలర్ విరుదలైన దగ్గర నుంచి అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది ఏమిటి అంటే ఆమె టవల్ ఫైట్ సీన్. ఈ సీన్లో టవల్ మాత్రమే కట్టుకొని కత్రినాకై ఒక సూపర్ యాక్షన్ సీక్వెన్స్ చేసింది. ఈ చిత్రం ట్రైలర్ చూసిన తర్వాత కొంతమంది ప్రేక్షకులు ఆ సీన్ కోసమే వెళ్లారు అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఆ సీన్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్.

ప్రస్తుతం ఈ హీరో డిసెంబర్ 1 విడుదలవుతున్న తన తదుపరి సినిమా ‘సామ్ బహదూర్’.. ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన విక్కీ కౌశల్ ఇటీవల తన భార్య  నటించిన ‘టైగర్ 3′ గురించి.. అలానే అందులో టవల్ ఫైట్ గురించి స్పందించారు. ఆయన మాట్లాడుతూ..కత్రీనాతో కలిసి టైగర్ 3 సినిమా చూసానని తను అద్భుతమైన యాక్షన్ నటి అని ప్రశంసలు కురిపించారు. తర్వాత ఈ సినిమాలో ఎంతో చర్చకు దారి తీసిన టవల్ ఫైట్‌ గురించి చెబుతూ.. ఆ టవల్ సైట్ లో కత్రినా కైఫ్ నటన అద్భుతమన్నారు. ఆ ఫైట్ కోసం ఆమె పడిన కష్టానికి గర్వపడుతున్నానని.. కత్రినా కైఫ్ ని అలా చూడతం తనకెంతో స్ఫూర్తిని కలిగించిందని.. ఇక నుంచి తనతో ఎప్పుడూ వాదించనని, ఎందుకంటే టవల్‌తో తను నన్ను కొట్టడం ఇష్టంలేదని.. ఎంతో ఫన్నీగా చెప్పకు వచ్చాడు విక్కీ కౌశల్.

ఇక తన భార్య కెరీర్ ని ఇలా ఎంకరేజ్ చేస్తూ విక్కీ కౌశల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

Also Read: Belly Fat: బెల్లీ ఫ్యాట్ లేదా అధిక బరువు సమస్య వేధిస్తోందా..ఈ 3 అలవాట్లు మానండి

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News