Karthikeya 2: రెండో రోజు మరింత పెరిగిన కార్తికేయ 2 వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కు ఇంకెంత దూరమంటే?

Karthikeya 2 Movie 2 Days Collections: నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన కార్తికేయ 2 చిత్రం ఆగస్టు 13న విడుదలై అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. ఈ సినిమా రెండు రోజుల వసూళ్ల వివరాల్లోకి వెళితే 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 15, 2022, 12:09 PM IST
 Karthikeya 2: రెండో రోజు మరింత పెరిగిన కార్తికేయ 2 వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ కు ఇంకెంత దూరమంటే?

Karthikeya 2 Movie 2 Days Collections: నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 13వ తేదీన విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటుంది. మొదటి ఆట నుంచి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొదటి రోజు శనివారం కావడంతో మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా ఆదివారం నాడు కూడా అదే జోరు చూపిస్తూ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి కలెక్షన్లు సాధించింది.

ఇక ఈ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహించగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల మీద వివేక్ కూచిభొట్ల, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.  ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు మూడు కోట్ల 50 లక్షల వసూళ్ల సాధిస్తే రెండో రోజు మూడు కోట్లు 81 లక్షల వసూళ్లు సాధించి రెండు రోజులకు గాను ఏడు కోట్ల 31 లక్షల షేర్ వసూళ్లు సాధించింది. ఇక రెండో రోజు ప్రాంతాలవారీగా వసూళ్ల విషయానికి వస్తే నైజాం ప్రాంతంలో కోటి 36 లక్షలు, సీడెడ్ ప్రాంతంలో 69 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 55 లక్షలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 29 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 25 లక్షలు, గుంటూరు జిల్లాలో 31 లక్షలు, కృష్ణాజిల్లాలో 30 లక్షలు, నెల్లూరు జిల్లాలో 11 లక్షల వసూళ్లు సాధించింది.

అలాగే రెండు రోజులకు గాను కర్ణాటక సహా మిగతా ప్రాంతాలలో 45 లక్షలు వసూళ్లు సాధించిన ఈ సినిమా నార్త్ ఇండియాలో 16 లక్షలు వసూళ్లు సాధించింది. ఇక ఓవర్సీస్ లో రెండు కోట్ల 15 లక్షల రూపాయలు వసూలు చేసిన ఈ సినిమా రెండు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల ఏడు లక్షల షేర్ వసూలు సాధించినట్లయింది. ఇక ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 12 కోట్ల 80 లక్షల రూపాయలకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 13 కోట్ల 30 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఇక సినిమా ఇంకా మూడు కోట్ల 23 లక్షల సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయినట్లే. సోమవారం వీక్ డే అయినా సరే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సెలవు ప్రకటించడంతో సోమవారం నాటికి బ్రేక్ ఈవెన్ కావడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు ట్రేడ్ వర్గాల వారు.

Also Read: Pavitra Lokesh: నరేష్-పవిత్రలది ప్రేమ బంధం కాదట.. కరెన్సీ బంధమట.. ఎందుకో తెలుసా?

Also Read: Nikhil Siddarth: కార్తికేయ 2 విషయంలో విలన్ దిల్ రాజు కాదు.. అసలు విషయం బయట పెట్టిన నిఖిల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News