Karan Johar on Deverakonda: విజయ్ దేవరకొండతో కరణ్ అసభ్య ప్రవర్తన.. వెలుగులోకి సంచలన ట్వీట్!

Karan Johar with Vijay Deverakonda: లైగర్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయ్ దేవరకొండ తో శారీరిక సంబంధం పెట్టుకోవడానికి కరన్ జోహార్ ప్రయత్నించారని అయితే విజయ్ దేవరకొండ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు అంటూ ఉమైర్ సందు సంచలన ట్వీట్ చేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 08:58 AM IST
Karan Johar on Deverakonda: విజయ్ దేవరకొండతో కరణ్ అసభ్య ప్రవర్తన.. వెలుగులోకి సంచలన ట్వీట్!

Karan Johar tried to seduce Vijay Deverakonda: బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ గురించి జరగని ప్రచారం అంటూ ఉండదు. ఆయన గే అని ఆయన పలువురు హీరోలతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారని ఇలా రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఆయనతో ఒక తెలుగు హీరోకి లింకు పెడుతూ స్వయం ప్రకటిత దుబాయ్ సినిమా సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశాడు. లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో లైగర్ సినిమాని విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా కరణ్ జోహార్ నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ సినిమా నిర్మించాలని అనుకున్నారు. కానీ భారీగా బడ్జెట్ పెరిగిపోయిన నేపథ్యంలో కరణ్ జోహార్ కూడా ఇందులో భాగమయ్యారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే విజయ్ దేవరకొండ తో శారీరిక సంబంధం పెట్టుకోవడానికి కరన్ జోహార్ ప్రయత్నించారని అయితే విజయ్ దేవరకొండ అందుకు ససేమిరా ఒప్పుకోలేదు అంటూ ఉమైర్ సందు సంచలన ట్వీట్ చేశాడు.

అయితే ఒకప్పుడు కేవలం బాలీవుడ్ మేకర్స్ గురించి బాలీవుడ్ హీరో హీరోయిన్ల గురించి మాత్రమే ట్వీట్లు చేస్తూ వస్తున్న ఉమైర్ టాలీవుడ్ కి ఏర్పడుతున్న క్రేజ్ చూసి ఇప్పుడు టాలీవుడ్ హీరో హీరోయిన్లను దర్శకనిర్మాతలను కూడా ఇన్వాల్వ్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళ పేర్లు మెన్షన్ చేస్తూ అనేక వివాదాస్పద ట్వీట్లు చేయగా ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు వాడుతూ ఉమైర్ సందు ట్వీట్ చేసిన వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. అయితే అసలు ఈ నిజానికి ఈ ఉమైర్ అనే పేరుతో ఒక వ్యక్తి ఉన్నాడా? లేడా? అనే విషయం మీద కూడా చర్చ జరుగుతుంది.

ఎందుకంటే ఆయన దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అని చెప్పుకుంటున్నాడు కానీ అందుకు తగ్గ ఆధారాలు మాత్రం లేవు. ఈ విషయం మీద హీరో హీరోయిన్లు కూడా స్పందించిన దాఖలాలు లేవు. ఇటీవల శ్రీనిధి శెట్టి గురించి గురించి ఆయన కామెంట్లు చేయగా ఆయన కామెంట్లకు కౌంటర్ ఇస్తూ శ్రీనిధి శెట్టి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఆమె తప్ప ఇతర ఏ సెలబ్రిటీ కూడా ఉమైర్ సందు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించడం లేదు. మరి ఈ విషయం మీద విజయ్ దేవరకొండ స్పందిస్తాడా లేక కరణ్ జోహార్ టీమ్ ఏమైనా స్పందిస్తుందా అనేది చూడాల్సి ఉంది.

Also Read: Balagam OTT Release: ఓటీటీలో బలగం సందడి.. దిల్ రాజు పప్పులో కాలేశాడా?

Also Read: Rashmika Mandanna Alert: నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది.. రష్మిక జాగ్రత్తగా మాట్లాడకుంటే ఇబ్బందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News