Kantara Telugu Openings: 'కాంతార'ను హత్తుకున్న తెలుగోడు.. కన్నడ కంటే మనదగ్గరే ఎక్కువ ఓపెనింగ్స్!

Kantara Telugu version openings are much bigger: కాంతార సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు, అందుకే అన్ని బాషల కంటే తెలుగులోనే ఎక్కువ ఓపెనింగ్స్ లభించాయి. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 16, 2022, 09:34 PM IST
Kantara Telugu Openings: 'కాంతార'ను హత్తుకున్న తెలుగోడు.. కన్నడ కంటే మనదగ్గరే ఎక్కువ ఓపెనింగ్స్!

Kantara Telugu version openings are much bigger: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన కాంతార సినిమా కన్నడ నాట విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను మలయాళ, హిందీ, తెలుగు భాషల్లో కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సినిమా మంచి టాక్ తెచుకొవడమే కాక మంచి వసూళ్ల వర్షం కూడా కురిపిస్తోంది. నిజానికి కన్నడ కాంతార వసూళ్లు కేవలం రెండున్నర కోట్ల గ్రాస్ తోనే మొదలైంది కానీ మౌత్ టాక్ కారణంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయిందనే చెప్పాలి.

ఈ సినిమా రెండో వారంలో కన్నడలో కేజిఎఫ్ 2 కంటే ఎక్కువ వసూళ్లు సాధించడం గమనార్హం. ఇక ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు ఈ సినిమా హిందీ, మలయాళ, తెలుగు వర్షన్స్ కూడా విడుదలయ్యాయి. హిందీ వర్షన్ మొదటి రోజు కోటి రూపాయల 30 లక్షల నెట్టు వసూళ్లు వసూలు చేస్తే గ్రాస్ సుమారు కోటి రూపాయలు 60 లక్షల దాకా ఉండవచ్చని అంటున్నారు; తెలుగు వర్షన్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ రావడంతో బాగానే రాబట్టింది.

కన్నడ నాట ఎంత అయితే ఈ సినిమా గ్రాస్ వసూలు చేసిందో దానికి డబుల్ తెలుగులో వసూలు చేసింది. ఏకంగా నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ తో ఈ సినిమా తెలుగు వసూళ్లు కనిపించాయి. తెలుగులో మొదటి రోజే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి సూపర్ హిట్ గా నిలిచినట్లు అయింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మిగతా అన్ని భాషల కంటే సినిమా తెలుగు  వెర్షన్ కి వచ్చిన వసూళ్లు ఎక్కువ. విజయ్ కిరగందూర్ ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద నిర్మించారు.

ఇక ఈ సినిమా కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీని విడుదలవగా తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో మాత్రం అక్టోబర్ 15వ తేదీ విడుదలైంది. ఇక ఏ భాషలో విడుదలైనా ఈ సినిమా అక్కడ మంచి అద్భుతమైన వస్తువులు సాధించిన తో ముందుకు వెళ్తుంది. ధియేటర్లో సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాను చూసి చాలా అబ్బుర పడుతున్నారు. సినిమా క్లైమాక్స్ కచ్చితంగా ప్రేక్షకులకు బాగా కిక్కిస్తోంది స్వయంగా ఈ సినిమాని రాసి డైరెక్ట్ చేసిన రిషబ్ శెట్టి ఈ సినిమాలో శివ అనే పాత్రలో కనిపించారు. అలాగే ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కిషోర్ ఊరు పెద్ద పాత్రలో అచ్యుత్ కుమార్ హీరోయిన్ పాత్రలో సప్తమి గౌడ కనిపించారు. మొత్తం మీద తెలుగు సినీ పరిశ్రమ ఈ కాంతార సినిమాకు మంచి ఊపిచ్చిందనే చెప్పాలి.

Also Read: Pawan Kalyan Tension: ఆర్కే బీచ్ కు పవన్.. నోవొటెల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సంచలనంగా విశాఖ టూర్!

Also Read: Ram Charan Praises Vishwak: నేను విశ్వక్ ఫాన్.. మాస్ కా దాస్ పై ప్రశంసల వర్షం కురిపించిన రామ్ చరణ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News