Kantara 2: కన్నడ బ్లాక్ బస్టర్ కాంతారా 2 షూటింగ్, విడుదల తేదీలు వెల్లడి, ఎప్పుడో తెలుసా

Kantara 2: బ్లాక్ బస్టర్ సినిమా కాంతారా గత ఏడాది సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంతారా సీక్వెల్ త్వరలో సెట్స్‌పై కెక్కనుంది. కాంతారా 2 షూటింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 23, 2023, 06:01 AM IST
Kantara 2: కన్నడ బ్లాక్ బస్టర్ కాంతారా 2 షూటింగ్, విడుదల తేదీలు వెల్లడి, ఎప్పుడో తెలుసా

Kantara 2: కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కాంతారా భారతీయ సినిమాలో అతిపెద్ద స్లీపర్ హిట్‌గా నిలిచింది. ఏ మాత్రం అంచనాల్లేకుండా, సైలెంట్‌గా విడుదలై కలెక్షన్లు కురిపించింది. బడ్జెట్ కంటే  ఎన్నోరెట్లు లాభాలు ఆర్జించింది. అందుకే కాంతారా 2 కోసం ఆసక్తి పెరిగిపోయింది. 

ఏ మాత్రం అంచనాలు లేకుండా ఎప్పుడు తీశారు, ఎప్పుడు విడుదలైందో తెలియకుండా వచ్చి సినిమా ప్రపంచాన్ని ఊపేసిన సినిమా కన్నడ యాక్షన్ థ్రిల్లర్ కాంతారా. 16 కోట్ల స్వల్ప బడ్జెట్‌తో తెరకెక్కి ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లు కురిపించిన సినిమా..రిషభ్ శెట్టిని రాత్రి రాత్రి పాన్ ఇండియా పటంలో అగ్ర నటుడిగా, దర్శకుడిగా నిలబెట్టేసింది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో కాంతారా 2 ఉంటుందని..ఫిభ్రవరి 2023 తేదీ అని కూడా ప్రకటించారు. అప్పటి నుంచి కాంతారా 2 ఎప్పుడా అనే ఆసక్తి పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ నిరీక్షణ ఇప్పుడు తొలగింది. 

కాంతారా 2 షూటింగ్ ఎప్పుడు ప్రారంభమౌతుంది, ఎప్పుడు విడుదల కావచ్చనే వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది అంటే 2023 నవంబర్ నెలలో కాంతారా 2 షూటింగ్ జరుపుకోనుంది. నవంబర్ 1వ తేదీకు మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రిషభ్ శెట్టి అండ్ టీమ్ దీనికి సంబంధించి రైటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. 

కాంతారా మొదటి భాగం రిషభ్ శెట్టి సొంత ఊరు కుందాపురలో జరగగా, రెండవ భాగం మంగళూరులో చేసేందుకు నిశ్చయించారు. రెండవ భాగం స్క్రిప్ట్‌కు అటవీ ప్రాంతం, భూమి, నీరు కావల్సి ఉంటాయి. అందుకే మంగళూరు ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కాంతారా 1 కంటే ఈసారి భారీ బడ్జెట్‌గా ఈ సినిమా ఉండనుంది. నాలుగు నెలల షెడ్యూల్ లో సినిమా షూటింగ్ ఉంటుంది. అంటే 2024 మొదటి త్రైమాసికానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి..అదే ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ఆలోచిస్తున్నారు. 

కాంతారా మొదటి భాగంలో ఉదహరించిన జానపదానికి నేపధ్యాన్ని రెండవ భాగంలో రివీల్ చేయనున్నట్టు తెలుస్తోంది. రిషభ్ టీమ్ ఇప్పటికే షూటింగ్ ప్రదేశాల కోసం కోస్టల్ కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్ని సందర్శించి..ప్రేక్షకులకు నచ్చే అనువైన ప్రాంతాల్ని గుర్తించారు. త్వరలోనే కాంతారా 2 పోస్టర్ ,టైటిల్ విడుదల కావచ్చు.

కోస్తా కర్ణాటక ప్రాంతంలోని సాంప్రదాయ పద్దతులు, ఆచారాల్ని లోతుగా చూపించడం, గ్రామాల మధ్య వివాదం, గ్రామ దేవతల సంరక్షణలో ఉండే భూమి, ఈ భూమి తమదంటూ ప్రకటించిన అటవీ శాఖ ఇలా విభిన్న కోణాల్లో కాంతారా తెరకెక్కింది. కాంతారా సినిమా కేవలం 16 కోట్లతో తెరకెక్కితే..కాంతారా 2 మాత్రం 126 కోట్లతో తెరకెక్కనున్నట్టు సమాచారం. 

Also read: Raashii Khanna: రాశి ఖన్నా క్లీవేజ్ షో అందాలు.. హాట్ ట్రీట్‌కు ఫ్యాన్స్ గుండె బేజారు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News