Kannappa: బాల ‘కన్నప్ప’ గా అదిరిపోయిన మరో మంచు వారసుడు.. కృష్ణాష్టమి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల..

Kannappa as Manchu Avram: మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ 'కన్నప్ప'. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్‌ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న  ఈ మూవీపై ప్యాన్ ఇండియా లెవల్లో  అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో  ప్రభాస్, అక్షయ్ కుమార్,  మోహన్‌లాల్ వంటి ప్యాన్ ఇండియా యాక్టర్స్ నటిస్తుండటంతో ఈ సినిమా అంచనాలు పీక్స్‌ను మించి పోయాయి. ఇప్పటికే ప్రతి సోమవారం ఈ సినిమా నుంచి పూటకో అప్ డేట్ ఇస్తున్నా మూవీ మేకర్స్ ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 26, 2024, 04:02 PM IST
Kannappa: బాల ‘కన్నప్ప’ గా అదిరిపోయిన మరో మంచు వారసుడు.. కృష్ణాష్టమి సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల..

Kannappa as Manchu Avram: విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే కన్నప్ప నుంచి విడుదల చేసిన టీజర్ తో పాటు ఇందులో నటిస్తోన్న ఆర్టిస్టులకు సంబంధించిన లుక్స్ ను ప్రతి సోమవారం విడుదల చేస్తున్నారు. సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి.. ప్రతి మండే ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ కంటిన్యూగా ఇస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాపై అంచనాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ క్రమంలో  కృష్ణాష్టమి సందర్భంగా సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌ను పోషించిన మంచు వారి మూడో తరం నుంచి అవ్రామ్ భక్త మంచు లుక్‌ను విడుదల  చేశారు. మంచు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రెండు తరలా హీరోలు ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ కోవలో మంచు కుటుంబం నుంచి మూడో తరంలో మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు ఇపుడు వెండితెరపై చిన్నప్పటి భక్త కన్నప్పగా వెండితెరపై చెలరేగి పోవడానికి రెడీ అవుతున్నాడు.  

కన్నప్పలో అవ్రామ్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను డా.మంచు మోహన్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక ఈ పోస్టర్‌లో అవ్రామ్ ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో కాళీ మాత విగ్రహం డిజైన్ కూడా ఓ రేంజ్ లో అదరిపోయింది. తిన్నడు బాల్యానికి సంబంధించిన లుక్‌లో అవ్రామ్ కనిపించబోతున్నాడు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన చిత్రాల్లో చిన్నప్పటి కృష్ణ  పాత్రలో రమేష్ బాబు వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత మోహన్ బాబు రెండో తనయుడు మంచు మనోజ్ కూడా చిన్నప్పటి మోహన్ బాబు పాత్రలో ‘బ్రహ్మ’, ’పుణ్యభూమి నా దేశం’ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అటు రవితేజ ‘రాజా ది గ్రేట్’ మూవీలో చిన్నప్పటి రవితేజ పాత్రలో ఆయన తనయుడు నటించాడు. ఇపుడు అదే తరహాలో మంచు విష్ణు చిన్నప్పటి పాత్రలో విష్ణు కనిపించబోతుండటం విశేషం.

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తోన్న  కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు మంచు భారీ ఎత్తున రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో  నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా.  ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది. త్వరలో రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. బహుశా ఇయర్ ఎండింగ్ వీకెండ్ లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.  

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News