Kangana Ranaut Marriage: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన పెళ్లి ఎప్పుడన్న విషయంపై క్లారిటీ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమెకు వచ్చే ఐదేళ్లలో మీ ప్రణాళికలు ఏమిటీ? అన్న ప్రశ్న ఎదురైంది. దీంతో కంగనా రనౌత్ మాట్లాడుతూ... ఐదేళ్లలో ఓ తల్లిగా తనను తాను చూసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పింది. త్వరలోనే వివాహం చేసుకోవాలని, పిల్లలను కనాలని ఉందని తెలిపింది. తన జీవితంలో ఓ ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారని ఆమె స్పష్టం చేసింది. తన మనసుకు నచ్చిన ఓ వ్యక్తి గురించి త్వరలోనే అందరికీ తెలుస్తుందని తెలిపింది. అంతేకాకుండా అతడిని త్వరలోనే పరిచయం చేస్తానని చెప్పింది. మరి ఈ ఫైర్ బ్రాండ్ మనసును కొల్లగొట్టిన ఆ మిస్టర్ ఫైర్ బ్రాండ్ ఎవరై ఉంటారా అని బాలీవుడ్ లో సెర్చింగ్ మొదలుపెడుతున్నారు నెటిజన్స్.
ఎప్పుడు వివాదాలను కొనితెచ్చుకొనే పనిలో ఉండే అమ్మడు ఒకప్పుడు ఓ స్టార్ హీరో ప్రేమలో పడినా.. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కుదరక విడిపోయారు. ఇక ఆ తర్వాత ట్విట్టర్ లో తన వాక్చాతుర్యాన్ని చూపిస్తూ వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అమ్మడు తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన భాగస్వామి గురించి మాట్లాడి ఇలా ఆశ్చర్యపరిచింది.
ఇక ట్రెండింగ్ లో ఉండే వివాదాస్పద అంశాలపై తప్పకుండా స్పందిస్తుందన్న పేరు కంగనా రనౌత్‌కు ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఇటీవల బాగా వార్తల్లో నిలిచింది. ఆమెకు కేంద్ర ప్రభుత్వం భద్రతను కూడా పెంచింది. కాగా, ‘తలైవి’ సినిమాలో జయలలిత పాత్రలో నటించి ఆమె అలరించింది. ప్రస్తుతం ఇందిరా గాంధీ జీవిత కథతో సినిమా నిర్మించాలని భావిస్తోంది.
ప్రస్తుతం కంగన.. ‘ధాకడ్’, ‘తేజస్’, ‘అపరాజిత అయోధ్య’, ‘సీత’, ‘మణికర్ణిక రిటర్న్స్’ సినిమాల్లో నటిస్తోంది. మణికర్ణిక ప్రొడక్షన్స్‌లో 'టికూ వెడ్స్ షేరూ' నిర్మిస్తోంది. ఆ చిత్ర షూటింగ్ ఇప్పుడు జరుగుతుంది.
Also Read: Adipurush Shooting Completed: 103 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook