Kamal Haasan Corona: కొవిడ్ నుంచి కోలుకున్న కమల్ హాసన్.. డిసెంబరు 3న డిశ్చార్జ్

Kamal Haasan Corona: తమిళ అగ్రకథానాయకుడు కమల్ హాసన్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని కమల్ చికిత్స పొందుతున్న చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రి.. ఈ విధంగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. డిసెంబరు 3వ తేదీన కమల్ ను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 05:41 PM IST
    • కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న నటుడు కమల్ హాసన్
    • మరో రెండు రోజులు ఐసోలేషన్ లో ఉండనున్న వైద్యులు వెల్లడి
    • డిసెంబరు 3న డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం
Kamal Haasan Corona: కొవిడ్ నుంచి కోలుకున్న కమల్ హాసన్.. డిసెంబరు 3న డిశ్చార్జ్

Kamal Haasan Corona: తమిళ ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్ ఆరోగ్యంపై చెన్నైలోని శ్రీరామచంద్ర ఆస్పత్రి వైద్యులు ఓ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కమల్ హాసన్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు స్పష్టం చేశారు. అయితే ముందు జాగ్రత్తగా మరికొన్ని రోజులు ఆయన ఐసోలేషన్ లో ఉంటే మంచిదని వెల్లడించారు. దీంతో కమల్ మరికొన్ని రోజులు ఐసోలేషన్ లోనే ఉండనున్నారు. 

“కొవిడ్ వైరస్ లక్షణాలతో నవంబరు 22న కమల్ హాసన్ మా ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడు కమల్.. వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అయినా ఆయన మరో రెండు రోజులు ఐసోలేషన్ లోనే ఉంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటే డిసెంబరు 3న డిశ్చార్జ్ చేస్తాం. డిశ్చార్జ్ తర్వాత కమల్.. తన పనుల్లో పాల్గొనవచ్చు” అని శ్రీరామచంద్ర ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

ఇటీవల అమెరికా నుంచి చెన్నై చేరుకున్న కమల్ హాసన్ కు.. దగ్గు వస్తుండడం వల్ల వైదుడ్ని సంప్రదించారు. ఆ తర్వాత జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ గా తేలింది. దీంతో కమల్ వెంటనే ఐసోలేషన్ కు ఉంటూ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

కమల్ హాసన్.. ప్రస్తుతం ‘విక్రమ్’ సినిమాలో నటిస్తున్నారు. లోకేష కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా.. శంకర్ దర్శకత్వం వహించనున్న ‘ఇండియన్ 2’ చిత్రంతోనూ నటిస్తూ కమల్ బిజీగా ఉన్నారు.

Also Read: Sirivennela Seetharamasastry: ముగిసిన సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు

Also Read: Lakshya Trailer: లక్ష్య ట్రైలర్.. పడిలేచిన వాడితో పందెం రిస్కే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News