Kamal Haasan: బిగ్‌బాస్‌కు అగ్ర హీరో బ్రేక్‌.. ఎందుకు.. ఏం జరిగిందో తెలుసా?

Kamal Haasan With Heavy Heart Breaks Bigg Boss Tamil Journey: ప్రేక్షకుల విశేష ఆదరణ పొందుతున్న బిగ్‌బాస్‌ షోకు స్టార్ హీరో బ్రేక్‌ ఇచ్చారు. ఇక షోకు హోస్ట్‌గా వ్యవహరించలేనని తేల్చి చెప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 6, 2024, 07:20 PM IST
Kamal Haasan: బిగ్‌బాస్‌కు అగ్ర హీరో బ్రేక్‌.. ఎందుకు.. ఏం జరిగిందో తెలుసా?

Kamal Haasan Bigg Boss Tamil: బిగ్‌బాస్‌ షో అంటే ప్రేక్షకుల్లో ఎప్పటికీ ఆసక్తిగా ఉంటుంది. త్వరలోనే దక్షిణాది భాషల్లో మరో సీజన్‌ ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ్‌ భాషల్లో ఈ షో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ఈలోపే ఓ ప్రముఖ హీరో బిగ్‌బాస్‌ షోకు భారీ షాకిచ్చారు. ఇక షోకు హోస్ట్‌ చేయలేనని కుండబద్దలు కొట్టారు. బరువెక్కిన గుండెతో షోకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఆయనెవరో కాదు స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌. తమిళ్‌ బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌ చేయలేనని వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఓ లేఖను విడుదల చేశారు.

Also Read: Movies Tree Collapse: 'సినిమాల చెట్టు' కూలింది.. గోదావరి గట్టు బోసిపోయింది

 

గుండెభారంతో
'బరువెక్కిన హృదయంతో మీతో ఈ విషయం పంచుకుంటున్నా. ఏడేళ్ల కిందట ఏర్పడిన ప్రయాణానికి చిన్న విరామం ఇస్తున్నా. పలు సినిమాల కారణంగా బిజీ ఉండడంతో రాబోయే బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరించలేకపోతున్నా. బిగ్‌బాస్ షోతో మీ అందరి ఇళ్లకు రావడం గర్వంగా ఉంది. నాతోపాటు ఈ షోపై మీరు చూపి ప్రేమాభిమానానికి కృతజ్ఞతలు. ఎప్పటికీ మీకు రుణపడి ఉంటా. మీ అభిమాన కంటెస్టెంట్‌లకు మీరు ఇచ్చి మద్దతుతో భారతీయ టెలివిజన్‌ షోలలో బిగ్‌బాస్‌ తమిళ్‌ ఉత్తమ రియాల్టీ షోగా నిలిచింది' అని కమల్‌ హాసన్‌ తెలిపారు.

Also Read: Ali Double Entry: రాజకీయాలకు గుడ్‌బై చెప్పేసిన నటుడు అలీ 'డబుల్‌ ఇస్మార్ట్‌' జోష్‌తో సినిమాల్లోకి..

 

'హోస్ట్‌గా నన్ను నేను కొత్త కోణంలో చూడడమే కాదు ఎన్నో విషయాలు నేర్చుకున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. విజయ్‌ టీవీ బృందానికి ధన్యవాదాలు. త్వరలో ప్రారంభమయ్యే సీజన్‌ మరింత విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా' అంటూ కమల్‌ హాసన్‌ ముగించారు. 2017లో ప్రారంభమైన తమిళ బిగ్‌బాస్‌ షో ఏడు సీజన్లు పూర్తయ్యాయి. ఈ షో ప్రారంభం నుంచి హోస్ట్‌గా కమల్‌ హాసన్‌ వ్యవహరిస్తున్నారు. ఏడు సీజన్లు విరామం లేకుండా హోస్ట్‌ చేసిన కమల్‌ హాసన్‌ ఇప్పుడు బ్రేక్‌ ఇచ్చారు.

ఏడేళ్ల ప్రయాణం
ఈ షో హోస్ట్‌ చేస్తూనే కమల్‌ హాసన్‌ వరుసగా సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన విక్రమ్‌ సినిమా కూడా చేశారు. ఇటీవల భారతీయుడు 2 సినిమా నటించగా.. ఆశించిన విజయం సాధించలేదు. మరో సీక్వెల్‌ భారతీయుడు 3 తీయాలని కమల్‌ హాసన్‌ ప్రణాళికలు వేసుకున్నారు. అంతేకాకుండా విక్రమ్‌ 2 కూడా పట్టాలెక్కాల్సి ఉంది. మణిరత్నం దర్శకత్వంలో 'థగ్‌ లైఫ్‌' సినిమా చేస్తున్నారు. ఇలా సినిమాలతో బిజీగా ఉండడంతో బిగ్‌బాస్‌కు హోస్ట్‌ చేయలేని పరిస్థితి. ఈ కారణంగా బిగ్‌బాస్‌కు కమల్‌ దూరమయ్యారు. అయితే కమల్‌ స్థానంలో ఎవరు వస్తారనేది ఉత్కంఠ నెలకొంది. యువ నటుడు శింబు తదుపరి హోస్ట్‌ అవుతారని చర్చ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x