Vikram Movie: లోకనాయకుడి విక్రమ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Vikram Movie: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. భారీ కలెక్షన్లు చేస్తున్న ఈ సినిమా ఓటీటీ విడుదలపై స్పష్టత వస్తోంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 4, 2022, 09:32 PM IST
Vikram Movie: లోకనాయకుడి విక్రమ్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Vikram Movie: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. భారీ కలెక్షన్లు చేస్తున్న ఈ సినిమా ఓటీటీ విడుదలపై స్పష్టత వస్తోంది. 

జూన్ 3న విడుదలైన విక్రమ్ సినిమా బాక్సాఫీసు కొల్లగొడుతోంది. చాలాకాలం తరువాత లోకనాయకుడికి మంచి బ్రేక్. కమల్ హాసన్‌తో పాటు ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించగా..సూర్య ప్రత్యేక పాత్రలో కన్పిస్తాడు. జూన్ 3న విడుదలైన ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా 2 వందల కోట్ల వరకూ సంపాదించిందని తెలుస్తోంది. 

విక్రమ్ సినిమాను తెలుగులో హిట్ లిస్ట్ పేరుతో సుధాకర్ రెడ్డి, హీరో నితిన్ విడుదల చేశారు. ప్రస్తుతం తొలి రెండ్రోజులు కలెక్షన్లు బాగున్నాయి. హిట్ టాక్ విన్పిస్తోంది. అదే సమయంలో ఓటీటీలో ఎప్పుడు విడుదలవుతుందా అనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకుంది. థియేటర్లలో కలెక్షన్లు కాస్త తగ్గిన తరువాత..లేదా 4-5 వారాల తరువాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావచ్చని తెలుస్తోంది. అంటే జూలై మొదటివారంలో విక్రమ్ సినిమా..హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కావచ్చు.

విక్రమ్ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకు పైగా వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. తమిళనాడులో అత్యధికంగా 20 కోట్లు, ఓవర్సీస్‌లో 11.50 కోట్లు వసూలు చేయగా..తెలుగు రాష్ట్రాల్లో 3.70కోట్లు, కేరళలో 5.20 కోట్లు రాబట్టింది. తొలివారంలో వంద కోట్ల క్లబ్‌కు చేరవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నాలుగేళ్ల తరువాత స్క్రీన్ ముందుకొచ్చిన కమల్ హాసన్ మంచి హిట్ సాధించాడు.

Also read: Prasanth Neel: హ్యాపీ బర్త్‌డే ప్రశాంత్ నీల్, సందడి చేసిన యశ్, ప్రభాస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News