Kalyan Ram:‘డెవిల్’ సినిమా కోసం ఏకంగా 90 కాస్ట్యూమ్స్‌…ఆశ్చర్యపరుస్తున్న కళ్యాణ్ రామ్

Devil: బింబిసారా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత అమిగోస్ అనే వైవిధ్యమైన కథతో మన ముందుకు వచ్చారు. కానీ ఆ చిత్రం మాత్రం అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కాగా ఇప్పుడు తన ఆశలన్నీ తన తదుపరి చిత్రం డెవిల్ పైనే పెట్టుకున్నారు ఈ హీరో. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి లుక్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2023, 05:14 PM IST
Kalyan Ram:‘డెవిల్’ సినిమా కోసం ఏకంగా 90 కాస్ట్యూమ్స్‌…ఆశ్చర్యపరుస్తున్న కళ్యాణ్ రామ్

Kalyan Ram Costumes: వైవిద్యమైన కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ హీరో కళ్యాణ్ రామ్ ముందుంటారు. అదే ఫాలో అవుతూ ఇప్పుడు ఈ హీరో మరో వైవిధ్యమైన సినిమా డెవిల్ తో మన ముందుకి రానున్నారు. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుద‌ల‌ కానుంది.  పీరియడ్‌ డ్రామా గా రానున్న ఈ చిత్రం బ్రిటీష్‌వారు ఇండియాను ప‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌థ‌తో నాటి ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా భారీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందువలన ఈ సినిమాలో న‌టీన‌టులకు సంబంధించిన వ‌స్త్రాలంక‌ర‌ణ భార‌తీయ‌త‌ను ప్ర‌తిబింబించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సినిమా యూనిట్. 

క‌ళ్యాణ్ రామ్‌ ఈ సినిమాలో గూఢ‌చారిగా క‌నిపించ‌బోతున్నారు. ఇలాంటి పాత్ర‌ను ఆయ‌న చేయ‌టం ఇదే మొద‌టిసారి కావ‌టంతో ద‌ర్శ‌క నిర్మాత అభిషేక్ నామా, కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ , క‌ళ్యాణ్ రామ్ లుక్‌ను సినిమా ఆసాంతం స‌రికొత్త‌గా ఉండేలా డిజైన్ చేశారట. ఇక ఇదే విషయం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు ఈ సినిమా కాస్ట్యూమ్ డిజైనర్. 
ఈ చిత్రం కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్ మాట్లాడుతూ ‘‘అభిషేక్ నామాగారు డెవిల్ స్క్రిప్ట్ నాకు వివరించ‌గానే హీరోగారి లుక్ డిఫరెంట్‌గా ఉండాల‌ని అర్థ‌మైంది. ఇందులో హీరో భారతీయుడు, అయిన‌ప్ప‌టికీ బ్రిటీష్ గూఢ‌చారిగా ప‌ని చేస్తుంటారు. ఆయ‌న పాత్ర ను ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయాల‌నుకున్నాను. ఈ సినిమాలో క‌ళ్యాణ్ రామ్‌ను గ‌మ‌నిస్తే ఆయ‌న ధోతి కట్టుకుని ఉంటారు. పైన ఒక వెయిస్ట్‌ కోటుని ధ‌రించి ఉంటారు. ఆయ‌న కాస్ట్యూమ్స్‌లో భార‌తీయ‌త క‌నిపించేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం’’ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ చిత్రంలో కాస్ట్యూమ్స్ హైలెట్స్ గురించి కూడా కొన్ని పాయింట్లు చెప్పారు. 

ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్ కోసం వెయిస్ట్ కోటుతో పాటు దేశీయ‌ కాట‌న్‌తో కుర్తా, ధోతిని తయారు చేశారు. ఇక ఈ చిత్రం లో క‌ళ్యాణ్ రామ్ 90 కాస్ట్యూమ్స్‌ను ఉప‌యోగించారు.  అంతేకాదు ఇట‌లీ నుంచి తెప్పించిన‌ మోహైర్ ఊల్‌తో 60 బ్లేజ‌ర్స్‌ను ప్ర‌త్యేకంగా తయారు చేశారు. ప్ర‌తీ కాస్ట్యూమ్ (బ్లేజ‌ర్‌, కుర్తా, ధోతి)కి 11.5 మీట‌ర్స్ ఫ్యాబ్రిక్‌ను ఉప‌యోగించారు.‌ హీరోని స్టైల్‌గా చూపించే క్ర‌మంలో 25 ప్ర‌త్యేక‌మైన‌ వెయిస్ట్ కోట్స్‌ను ఉప‌యోగించారు. కాస్ట్యూమ్ డిజైన‌ర్ రాజేష్‌కి డెవిల్ 60వ చిత్రం.. క‌ళ్యాణ్ రామ్‌తో ఇది 6వ సినిమా. ఎం.ఎల్‌.ఎ, 118, ఎంత మంచివాడ‌వురా వంటి క‌ళ్యాణ్ రామ్ సినిమాల‌కు రాజేష్ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ఆయ‌న చేయ‌బోతున్న నెక్ట్స్ 3 సినిమాల్లోనూ రాజేష్ వ‌ర్క్ చేస్తున్నారు.

Also Read:  WPL 2024 Auction: మల్లికా సాగర్ ఎవరు..? WPL ఆక్షనీర్ ఎందుకంత స్పెషల్..?

Also Read:  Tata Tiago Price: రూ. 5.60 లక్షలకే 26.49కిమీ మైలేజీ ఇచ్చే టాటా టియాగో..పూర్తి వివరాలు ఇవే!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News